27 November 2007

వంశ పారంపర్యం

"వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.
"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.

22 November 2007

ఏ పక్క

"మీ ఆవిడా, మీ అమ్మా సూర్యాకాంతం, ఛాయాదేవిల్లా రోజూ పోట్లాడుకుంటునప్పుడు నువ్వే పక్క నిలిచుంటావు?" సుధాకర్‍ను అడిగాడు కరుణాకర్.

"గోడపక్క" చెప్పాడు సుధాకర్

21 November 2007

భయం

"నాకూ, మా ఆవిడకు ఏమైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసి ఉంచుతాను"

"ఏం.... మీ ఆవిడ అలిగి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా?"

"కాదు..... నన్ను తోసేస్తుందని."

20 November 2007

కోరిక

"నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.

"వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి.

"ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా.

19 November 2007

పట్టుదల

"పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం

"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.

17 November 2007

రుసరుసలు

"ఏమిటి పిన్నిగారు అంతకోపంగా ఉన్నారు?" శ్రామలమ్మను అదిగింది వరమ్మ.
"ఇవాళ ముచ్చటపది RTC Bus standలో weighing machine ఎక్కి రూపాయి నాణెం వేస్తే.......

ఒక్కసారే ఇద్దరు ఎక్కకూడదు అని వచ్చింది" కోపంగా అంది శ్యామలమ్మ.

16 November 2007

చిరుత ... ఆ తరువాత

ఈ మధ్య నాకు వచ్చిన forward mail:
చిరంజీవి కొడుకు సినిమా - చిరుత : చిరు తనయ, అయితే, మరి మిగతా హీరోల
కొడుకుల సినిమలు ఏమి అవ్వచ్చు?

బుడత - బాలకృష్ణ తనయ

ఉడత - వెంకటేష్ తనయ

మిడత - మోహన్ బాబు తనయ

పిచుక - పవన్ కళ్యాణ్ తనయ
........

15 November 2007

death certificate

"మా నాన్నగారి death certificate submit చేస్తే కానీ మా అమ్మకు pension ఇవ్వరట. అదేదో ఇచ్చి పుణ్యం కట్టుకోండి డాక్టర్ గారు.

"ఓ.. అలాగా... దానికేం భాగ్యం.... ఇంతకీ మీ నాన్న గార్ని treat చేసిన డాక్టరెవరు?
"ఆయన అదృష్టవంతులండి.. ఏ డాక్టర్ treat చెయ్యలేదండీ... ఆయనంతట ఆయనే పోయారు...."

14 November 2007

నిద్ర పోయేముందు

డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్ర్రిప్షన్ మందుల షాపువాడికి ఇచ్చి "ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి" అని అడిగాడు వాసు.

"రెండెందుకండీ?" అమాయకంగా అడిగాడు షాపువాడు.
"ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు. ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి.."

13 November 2007

చెక్కు

"రావయ్యా చంద్రం! ఇప్పుడే నీ గురించే చెప్పారు మావాళ్ళు" అన్నాడు డాక్టర్ సుందర్.
"ఎందుకండీ?" అన్నాడు చంద్రం.
"ఫీజు కింద నువ్వు ఇచ్చిన చెక్కు bounce అయిందట" అన్నాడు డాక్టర్.
"మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది" బదులిచ్చాడు చంద్రం.

19 October 2007

బాక్సింగ్

ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి.

"ఊ కొట్టు... కొట్టు.... దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి" అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి.
"మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?" అడిగాడు పక్కనున్న వ్యక్తి.
"కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్‌ని" చెప్పాడు దంతనాధం

12 October 2007

తొందరగా

డాక్టర్ ప్రకాశ్ దగ్గర ట్రీట్‍మెంట్ తీసుకుంటున్నాడు గోపాల్.

"మీరు నేను గాఢమైన మిత్రులం. ఫీజిచ్చి ఓ మంచి స్నేహితుణ్ణి అవమానించలేను. ఫ్రీగా సేవ చేయించుకోవడమూ ఇష్టం లేదు. కాబట్టి మీకు ఎంతో కొంత అందేలా నా వీలునామాలో మార్పులు చేస్తా" చెప్పాడు గోపాల్.



"డబ్బు కాస్త త్వరగా అవసరం. ఓసారి ఆ ప్రిస్ర్కిప్షన్ ఇస్తారా? నేను కొద్దిగా మార్పులు చేస్తా" అన్నాడు డాక్టర్ ప్రకాశ్.

11 October 2007

జర్మనీ

టర్కీ వాళ్ళని టర్క్స్ అని పిలుస్తారు. మరి జర్మనీ వాళ్ళనూ..." పాఠం చెబుతోంది టీచర్.

"నాకు తెలుసు టీచర్" చెప్పాడు బంటీ

"ఏమంటారు"

"జెర్మ్స్" జవాబిచ్చాడు బంటీ

10 October 2007

న్యూటన్ - బెల్టు

9"న్యూటన తల మీద ఆపిల్ పడి భూమ్యాకర్షణ శక్తిని కనుక్కోవడం వల్ల మనం బతికిపోయాం కదమ్మా" స్కూల్లో పాఠం విని వచ్చాక తల్లితో చెప్పడు బంటీ.

"అదేంట్రా? " అడిగింది తల్లి.

"నాన్నది బెల్టుల బిజినెస్ కదా. మరి భూమ్యాకర్షణ లేకపోతే వాటినెవరు కొంటారు" వివరించాడు బంటీ.

09 October 2007

నెహ్రూ గారి మాటలు

రాష్ట్రపతి ఓ కాలేజీని సందర్శించి అక్కడి విద్యార్ధులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళేమి కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటున్నారు.



"నేను డాక్టర్‍ని అయ్యి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తా" అన్నడు రమణ.



"నేను ఇంజినీరునై దేశాన్ని అభివృద్ది పధంలోకి తీసుకెళ్తా" చెప్పాడు గోవింద్



"నేను మంచి తల్లినవుతా. చదువుకున్న బాధ్యతాయుతమైన తల్లి వల్లనే పిల్లలు మంచి పౌరులుగ రూపొంది దేశం బాగుపడుతుందన్నారు నెహ్రూ గారు " అంది దీప.



"మరి నువ్వో?" మౌనంగా ఉన్న హరిని అడిగారు రాష్ట్రపతి



"నెహ్రూగారి మాటలను నిజం చేసేందుకు నా వంతు సహకారం అందిస్తా" దీపకేసి ఓరగా చూస్తూ చెప్పాడు హరి.

08 October 2007

జస్టిస్

"ఏమ్మా.... నువ్వు జస్టిస్ చౌదరి గారి అమ్మాయివి కదూ?!"

"కాదండీ.... జస్టిస్ చక్రవర్తి గారి అమ్మాయిని"

"మరేం ఫర్వాలేదమ్మా... రామారావైతే నేంటి నాగేశ్వరరావు అయితేనేంటి, ఇద్దరు చేసింది జస్టిసే కదా!?"

05 October 2007

సాంప్రదాయం

అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి.

"చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను" చివరి జాగ్రత్తగా చెప్పింది.



"ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా మమ్మీ" అన్నది ఆధునికతరం యువతి.

04 October 2007

ప్రేమ

"రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు. పైగా వెళ్ళగానే వేడి వేడి కాఫీ ఇస్తుంది. స్నానానికి వేడి నీళ్ళు తోడి పెడ్తుంది. బట్టలు విప్పి నాకు స్వెటర్ వేస్తుంది..." చెబుతున్నాడు చింతామణి.


"అబ్బా... మీ ఆవిడకు నీ మీద చాలా ప్రేమన్న మాట" నోరు తెరుస్తూ అన్నాడు భూషణం.



"మరి అంత చలిలో అంట్లు తోమడం కష్టం కదా" - అసలు విషయం చెప్పాడు చింతామణి

03 October 2007

నమ్మకం

డబ్బు కోసం బ్యాంకును దోచుకోవాలనుకున్నాడు హరి.



లోపలికి ప్రవేశించి లాకర్ దగ్గరికి వెళ్ళగానే "దయచేసి పేల్చడమో, కోయడమో చెయ్యవద్దు. తలుపు తెరిచే ఉన్నది హ్యాండిల్ తిప్పండి చాలు" అని రాసుండటంతో ఆ పని చేశాడు.



వెంటనే ఒక ఇసక బస్తా నెత్తి మీద పడింది. అలారం మోగింది. దాంతో పోలిసులకు దొరికిపోయాడు.



వ్యాన్‍లో తీసుకెళ్తుంటే "హు.... ఏం మనుషులో ఏమో. ఈ రోజుల్లో నమ్మించి మోసం చేయడం మామూలైపోయింది" అనుకున్నాడు విచారంగా.

02 October 2007

బలి

"ఏవండోయ్... ఈ రోజు మన పళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం" చెప్పింది సుగుణ.



"ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?" పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్.

01 October 2007

కరెంట్

"కరెంటు పోయినా, క్యాండిల్ కూడా లేకుండా అంతా చీకట్లో అన్నయ్యగారు వంట ఎలా చేస్తున్నారు కాంతమ్మొదినా?" ఆశ్చర్యంగా అడిగింది పొరుగింటి అంజమ్మ.



"ఆయన photographer కదా.
Dark roomలో పనిచెయ్యడం ఆయనకి అలవాటే" తేలికగా చెప్పింది కాంతమ్మ.

30 September 2007

పుస్తకం

"అదేంట్రా... రెండూ ఒకే రకం పుస్తకాలెందుకు కొన్నావు?" గిరిని అడిగాడు శ్రీపతి.

"ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం పరీక్షలు పాసైనట్లే అని రాసుంది. అందుకే రెండు కొన్నాను" చెప్పాడు గిరి.

29 September 2007

ఈజిప్ట్

కొడుకు నాన్నతో "నాన్న నువ్వు ఈజిప్ట్ ఎప్పుడు వెళ్లావు?"

"నేను ఈజిప్ట్ ఎప్పుడూ వెళ్ళలేదు. అయినా నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నాన్న.

"మరి మమ్మీని ఎక్కడ నుంచి తీసుకొచ్చావు?"

28 September 2007

english medium

"బాబూ ఏది నీ నోరు చూపించు, అ, ఆ.. అను" అన్నాడు డాక్టర్ రాముతో.

పక్కనే ఉన్న రాము తండ్రి "మా వాడు english medium అండీ అ, ఆలు రావు" అన్నాడు డాక్టర్‍తో

27 September 2007

నిద్ర

"డాక్టర్ గారూ... ఈ మధ్య సరిగా నిద్ర పట్టడం లేదు. మంచి మందులేమైనా..." అడిగాడు శ్రీధర్.

"చూడండి.. నిద్ర పట్టడానికి మంచి వాతావరణం అవసరం. చక్కని మెత్తటి పరుపు, ఎత్తైన దిండ్లు, సుగంధభరితమైన్ అగరుబత్తి పొగలు, నీలంరంగు కాంతి బల్బు, కిటికీలకు మంచి కర్టెన్లు వేసుకుంటే నిద్ర దానంతట అదే వస్తుంది" చెప్పాడు డాక్టర్.

" కానీ ఆఫీసులో ఇన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడానికి వీలు కాదేమో డాక్టర్..."సందేహం వెలిబుచ్చాడు శ్రీధర్.

26 September 2007

అచ్చు

"పాతికేళ్ళ నుంచీ కవితలు రాస్తున్నానన్నారు కదా. ఇప్పటికి ఎన్ని కవితలు అచ్చు అయ్యాయి" అడిగాడు మురళి.



"ఓ! ఇన్ని!" తల వెంట్రుకలను చూపిస్తూ చెప్పడు కావ్యారావు.



"ఓహో అలాగా... రెండా?" అన్నాడు మురళి.

25 September 2007

ఒకే ప్రశ్న

Railway station లలో ,Bus stand లలో ఇద్దరు బిచ్చగాళ్ళు కలిసినా, ఇద్దరు సాఫ్ట్‍వేర్ ఇంజినీర్లు కలిసినా అడిగేది ఒకే ప్రశ్న. ఏంటది?




"నీది ఏ ప్లాట్‍ఫాం?"

24 September 2007

దీర్ఘాయుష్మాన్ భవ

"నాకు చాలాకాలంపాటు బతకాలని ఉంది డాక్టర్. ఏమైనా హెల్త్ టిప్స్ చెబుతారా?" అడిగాడు రాము

"పెళ్ళి చేసుకోండి" సలహా ఇచ్చాడు డాక్టర్.



"అలాగైతే ఎక్కువ కాలం బతుకుతారా?" ఆశ్చర్యపోయాడు రాము.



"అదేం లేదులే. కాకపోతే అప్పుడు కాలం భారంగా గడుస్తూ ఎక్కువ కాలం బతికినట్టు అనిపిస్తుంది" అసలు సంగతి చెప్పాడు డాక్టర్.

23 September 2007

సిగ్గు

"సిగ్గులేదటయ్యా నీకు? కూరలు తరుగుతుంటే వేలు తెగిందని సెలవు కావాలంటున్నావా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా" అరిచాడు ఆఫీసర్.



"నిజం సార్.... నిజంగానే వేలు తెగింది" వినయంగా అనాడు రంగారావు



"చాల్చాల్లే నోర్ముయ్....

గత పాతిక సంవత్సరాలుగా కూరలు తరుగుతునాను. ఒక్కసారి కూడా నాకు కనీసం గోరు కూడా తెగలేదు. అండర్ స్టాండ్" ఇంకా పెద్దగా అరిచాడు ఆఫీసర్.

22 September 2007

మంచిదంటే ఏది?

తన రూమ్‍లోకి క్యాలెండర్ కావాలంటూ బజారుకేళ్ళాడు రాము.

యజమాని క్యాలెండర్లు చూపిస్తుంటే ప్రతీ దాన్నీ వద్దంటూ.... "ఇంకాస్త మంచిదివ్వండి" అంటున్నాడు.

"నీ దృష్ఠిలో మంచిదంటే ఏంటి? " విసుకుగా అడిగాడు యజమాని.

"అంటే...... స్కూలుకు సెలవులు బాగా ఇచ్చేలా ఎర్రరంగు గళ్ళు ఎక్కువుండాలి"

21 September 2007

మందు

రామారావు ప్రతి రోజూ బార్‍కెళ్ళి మందు తాగుతాడు. విషయం ఏమిటంటే ప్రతీ రోజూ రెండు గ్లాసులు ఆర్డర్ చేసి పక్క పక్కనే పెట్టుకుని, ఒక్ సిప్పు ఒక గ్లాసులోంచి ,మరీ సిప్పు రెండో గ్లాసులోంచి తాగుతాడు. ఈ తతంగం అంతా చాలా రోజుల నుంచి చూసిన సర్వర్ ఆనందం ఉండబట్టలేక ఒక రోజు రామారావుని అడిగేశాడు.

"నేను ఎప్పుడూ మందు నా స్నేహితుడు సుబ్బారావుతో సలిసి తాగేవాడిని. ప్రమాదవశాత్తు అతను చనిపోయాడు. అతని జ్ఞాపకార్ధం ఈ విధంగా ఎప్పుడూ రెండు గ్లాసులు తాగుతున్నాను" చెప్పాడు రామారావు.

కొంతకాలం తరువాత రోజూ ఒక గ్లాసు మాత్రమే ఆర్డరు చెయ్యటం మొదలుపెట్టాడు రామారావు. ఈ విషయం గమనించిన సర్వర్ రామారావుని అడిగాడు "ఏంటి సార్ మీ స్నేహితుడిని పూర్తిగా మర్చిపోయారా?"

"లేదయ్యా నేను మందు మానేశాను" చెప్పాడు రామారావు.

20 September 2007

ఇచ్చట పెళ్ళికొడుకులు అమ్మబడును

హైదరాబాదులొ ఈ మధ్య ఒక కొత్త mall తెరిచారు. ఇచ్చట పెళ్ళి కొడుకులు కూడా అమ్మబడును అని ప్రకటనలు ఇచ్చారు (అవును సరిగ్గా పెళ్ళైన కొత్తలో సినిమాలో లాగానే). కాకపోతే కొన్ని షరతులు పెట్టారు, అవి ఏమిటంటే:
  • అమ్మాయిలు మా mallకి ఒక్కసారి మాత్రమే అనుమతింప బడుతారు
  • పెళ్ళి కొడుకులని వారి వారి హోదా, రుచులు, అభిరుచులకు తగ్గట్లు వివిధ అంతస్థులలో వర్గీకరించబడ్డారు. ఏ అంతస్థులో పెళ్ళి కొడుకునైనా మీరు ఎన్నుకోవచ్చును. ఆ అంతస్థులో నచ్చకపోతే మీరు మరో అంతస్థుకి వెళ్ళవచ్చు. కాకపోతే మీరు వెనక్కి తిరిగి రావటానికి అస్కారము లేదు, చివరి అంతస్థు నుంచి బయటకు పోవడం తప్ప.

ఇదేదో బావుందే చూద్దామని ఒక అమ్మాయి mallకి వస్తుంది. అంతస్థులవారీగా ఈ విధంగా సూచనలు ఉన్నాయి.

మెదటి అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు.

రెండవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు.

మూడవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు.

అద్భుతం!! అని అనుకుంటూ ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్ళింది ఆ అమ్మాయి.

నాలుగవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు. ఇంటి పని, వంట పనిలో కూడా సహాయ పడతారు.

"ఆహా !! ఈ mall చాలా బావుందే. ఈ అంతస్థులో నాకు కావలసిన వరుడు దొరుకుతాడు అని అనుకున్నది. అలా అనుకున్న మరు క్షణమే ఇంకా పైకి వెళ్తే ఎలాంటి వాళ్ళు ఉంటారబ్బా!! అని అనుకొని తరువాతి అంతస్థుకి వెళ్తుంది".

అక్కడి సూచన ఇది:

"మీతో కలిపి ఈ అంతస్థుకి చేరుకున్నవారి సంఖ్య : 61,397. ఈ అంతస్థులో పెళ్ళికొడుకులు లేరు. ఆడవాళ్ళని మెప్పించడం అసాధ్యం."

19 September 2007

మగవాళ్ళకు మాత్రమే

ఓ కంపెనీలో అందరూ మగాళ్ళను, అందునా పెళ్ళైన వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటున్నారు. పైగా ఆడవాళ్ళు అర్హులు కాదంటూ నోటిఫికేషన్‍లో రాయడంతో మండిపడ్డ మహిళా సంఘాలు ధర్నా చేశాయి. అసలు విషయం కనుక్కుంటే ఆ కంపెనీ యజమాని ఒక మహిళ. ఈ విషయం తెలిసిన మహిళా సంఘం నేతలు మరింత కోపం కలిగింది. ఆ యజమానిని ఈ విధంగా కోపంగా ప్రశ్నించారు "ఒక మహిళ అయ్యుండీ ఏమిటా నోటిఫికేషన్?"


"అబ్బే... మాకే విపక్షా లేదండి. ఇది ఇప్పుడిప్పుడే పైకొస్తున్న కంపెనీ. చెబితే వినేవాళ్ళు, ఆదేశాల్ని తక్షణం పాటించేవాళ్ళు, కోప్పడ్డా ఎదురుతిరగనివాళ్ళు కావాలి మాకు. అన్నిటికంటే ముఖ్యంగా ఆఫీస్ అవర్స్ అయిపోగానే తక్షణం ఇంటికి వెళ్ళాలనిపించకూడదు." అసలు విషయం చెప్పింది అధినేత.

18 September 2007

రెండో వివాహం

సుజిత్‍కు ఇంటర్నెట్‍లో చాటింగ్ ద్వారా కోమల పరిచయమయ్యింది. వాళ్ళిద్దరి రుచులు, అభిరుచులు కలిసి పరిచయం ప్రేమగా, ప్రేమ పెళ్ళిగా జరిగినాయి. ఒక రెండు నెలలు కాపురం బాగానే సాగింది. ఆ తరువాత సుజిత్‍కి తెలిసినది కోమలకి ఇంతక ముందే వివాహం అయ్యిందని. తనకు మోసం జరిగిందని కోర్టుకెక్కాడు సుజిత్.


కోర్టులో సుజిత్‍ని జడ్జి ప్రశ్నించసాగాడు :

జడ్జి : ఏం చేస్తుంటావు?

సుజిత్ : నేను క్రీడకారుడిని.


జ : Football, hockey, basket ball, volley ball,కబడ్డీ..... మొదలైనవి ఉన్నాయి కదా, మరి నీది ఏ క్రీడ?
సు :క్రికెట్



జ : క్రికెట్ లో ఏంటి? bowler, batsmen, wicket-keeper??

సు: bowler



జ:bowlingలో - fast bowler, medium face, slow, spinner రకాలు ఉన్నాయిగా మరి నువ్వేంటి?
సు : spinner



జ: మరి అదే కదయ్యా నీ ప్రాబ్లమ్ . Spinner చేతికి ఎప్పుడున్నా కొత్త బంతి దొరుకుతుందా?

17 September 2007

కూర

"ఈ రోజు మీ ఇంట్లో బెండకాయ కూర చేశారు కదూ వదినా?"

"అరె! అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగారు?"

"రాత్రి మా దొడ్లో బెండకాయలు ఎవరో దంగవెధవలు కోసుకెళ్ళార్లే"

16 September 2007

ఉండను

"అయ్యగారూ... మీ ఇంట్లో ఇక నేను పనిచెయ్యను. ప్రతిచిన్నదానికీ అమ్మగారు ఊరికే తిట్టిపోస్తున్నారు" చెప్పాడు నౌకర్.

"అబ్బా.. ఆ మాత్రం మాటపడలేవురా?" సర్ది చెప్పబోయడు యజమాని.

"నాకేం ఖర్మండీ... ఆమే తిట్లన్నీ పడడానికి నేనేమైనా ఆవిడ మొగుడినా?" వెళ్తూ అన్నాడు నౌకర్.

15 September 2007

చిన్న-పెద్ద

"మీరు చూస్తే చాలా చిన్న లాయర్లా ఉన్నారు. నా కేస్ టేకప్ చెయ్యగలరా?" సందేహంగా అడిగాడు క్లయింటు.

"ఫరవాలేదు. మీ కేసు పూర్తయ్యేనాటికి నేను పెద్ద లాయర్నవుతాను" అభయమిచ్చాడు లాయర్.

14 September 2007

number please

భర్త కోసం ఆఫీసుకు ఫోన్ చేసింది ధనలక్ష్మి. "కొంచెం మా ఆయన్ను పిలుస్తారా?" అడిగింది ఆపరేటర్ని.

"number please" అడిగింది ఆపరేటర్.

"నెంబరేమిటి నీ బొంద. నాకేమైనా పదిమంది మొగుళ్ళనుకున్నావా?" కయ్‍మంది ధనలక్ష్మి.

13 September 2007

దాచు

"రాధా....రాధా... వెంటనే మీ అమ్మగారిని గదిలోకి వెళ్ళి గంటదాకా బయటకు రావద్దని చెప్పు మా ఆఫీసరొస్తున్నారు" కంగారుగా అన్నాడు కృష్ణ.


"మీ ఆఫీసరుగారొస్తే మా అమ్మకేం భయమండీ?" అయోమయంగా అన్నది రాధ.


"అబ్బా... నీకు తెలియదు. మా అత్తగారు చనిపోయారని చెప్పి మొన్నటినుంచి సెలవులో ఉన్నాను" విషయం చెప్పాడు కృష్ణ.

12 September 2007

Blood circulation

"చూడండి మిస్.. చాలా లేటెస్ట్ టైట్స్. జపాన్ నుంచి తెప్పించాం. ఇవి వేసుకున్నారంటే blood circulation దెబ్బకు పెరుగుతుంది" డ్రెస్సులు చూపిస్తూ షాపతను కవితతో చెప్పాడు.



"వీటిని ధరిస్తే blood circulation ఎలా పెరుగుతుంది" ఆశ్చర్యంగా అన్నది కవిత.



"మీది కాదు మిస్. మీరు చదివే కాలేజీలోని కుర్రాళ్ళది" చెప్పాడు షాపతను.

11 September 2007

వాగ్దానం

"ఏమండీ... మొన్న ఎన్నికల్లో గెలిస్తే నాకు పదివేల రూపాయల పట్టుచీర కొనిపెడతామన్నారు. గెలిచి ఆర్నెల్లు అయినా మళ్లీ ఆ ఊసు ఎత్త లేదు" గోముగా అన్నది విశాలాక్షి.



"ఓట్లకోసం ఎన్నో వాగ్దానాలు చేస్తాం. అవన్నీ తీరుస్తురా ఎవరైనా విశాలా?" అన్నాడా రాజకీయ నాయకుడు.

10 September 2007

తొందర

"మనమ్మాయికి మంచి అందగాడిని, తెలివితేటలు గలవాడిని, ఆస్తిపరుడిని వరుడిగా తేవాలనుకుంటున్నాను" భార్యతో చెప్పాడు రామబ్రహ్మం.



"నిజం చెప్పారండీ ఈ విషయంలో మాత్రం మా నాన్నలా మనం తొందరపడకూడదు" చెప్పింది భార్య.

09 September 2007

లింగం మావా - మజాకా?

మొదటిసారి keyboard చూసి లింగం మావ ఏమనుకున్నాడు?
తారుమారుగా ఉన్న అక్షరాలను సరిచేయాలనుకున్నాడు.


Bus pass ఉన్నా లింగం మావ ticket ఎందుకు కొన్నాడు?
Conductorని April Fool చేద్దామని.


లింగం మావ తల ఎందుకు బొప్పి కట్టింది?
గోడ మీద వాలిన్న దోమలను రాయితో కొడుతుంటే, అతడి స్నేహితుడు బుర్ర ఉపయోగించమని సలహా ఇచ్చాడు.


స్నేహితుడు అప్పు చెల్లించకపోయినా లింగం మావ ఎందుకు సంతోషంగా ఉన్నాడు?
కొత్త అప్పు అడగనని మాట ఇచ్చాడు కాబట్టి.



Shopping complex ముందు ఆటో ముందటి చక్రం ఎందుకు విప్పాలనుకున్నాడు?
"Two wheeler parking" అని రాసున్నది

08 September 2007

అరుపు

"నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు
"అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి.
"మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు

"మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.

07 September 2007

ఇద్దరూ దొంగలే

ఇద్దరు స్నెహితులు పందెం పెట్టుకొని టెన్నిస్ ఆడుతున్నారు. ఆట చివరికొచ్చాక బంతి కనిపించకుండా పోయింది. కాసేపు వెతికాక- "బాల్ లేదు కాబట్టి ఆట క్యాన్సిల్" ఓడిపోయేట్టున్న రాము.

"ఇదిగో దొరికింది" తన జేబులో బంతిని పడేసి అరిచాడు సోము.
"బోడి యాభై రూపాయల కోసం నన్ను మోసం చేస్తావా?"

"నిజంరా నాకు దొరికింది"
"ఎలా దొరుకుతుంది? నేను దానిమీద నిల్చుంటే?"

06 September 2007

మగాడు

"నువ్వు మన పొరిగింటాయనతో అంత కేర్ ఫ్రీగా మాట్లాడటం నాకు నచ్చడం లేదు" కోపంగా అన్నడు సుధాకర్ భార్యతో.

"ఏం? మీరు మాత్రం ఆయనతో ఆయన భార్యతో అంత ఫ్రీగా మాట్లాడటం లేదూ?" అన్నది భార్య.

"నాకేం? నేను మగాణ్ణి"

"మరి ఆయన మాత్రం మగాడు కాదూ?" అన్నది భార్య.

05 September 2007

లింగం మావ - మూత్ర పరీక్ష

కాస్తంత జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గిరికెళ్లాడు లింగం మావ.

డాక్టర్ మూత్ర పరీక్ష చేయించుకురమ్మని రాస్తే ల్యాబ్‍కు వెళ్లాడు. తన వంతు కోసం వేచి చూస్తూంటే పక్కనే ఓ వ్యక్తి ఏడుస్తూ కనిపించాడు

"ఎందుకేడుస్తున్నావు " పలకరించాడు లింగం మావ.
"Doctor నన్ను రక్త పరీక్ష చేయించుకు రమ్మన్నారు"
"అయితే"
"రక్తం కోసం సూదితో వేలి చివర పొడిచారు. నొప్పిగా ఉన్నది"
అంతే.... ల్యాబ్ నుంచి ఒక్క పరుగున బయటికెళ్ళి పోయాడు లింగం మావ...

04 September 2007

Disturbance

ఆసుపత్రిలో...

"ఏదీ మీ నోరు తెరిచి నాలుక బాగా జాపండి" అన్నాడు Doctor. Patient అలానే చేశాడు.

Doctor చక చక మందులు రాసిచ్చాడు.



Patient వెళ్ళిపోగానే-

"అదేంటి Doctor, Patientని నోరు తెరవమని, నాలుకజాపమని అసలు అటుకేసి చూడకుండానే prescription రాశారు?" అడిగాడు junior doctor.

"అలా చెయ్యకపోతే patientలు ఆ మందు పేరేమిటి? ఈ టానిక్కు దేనికి? బాగా పని చేస్తుందా? లాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. అది నాకు నచ్చదు" నవ్వుతూ చెప్పడు senior doctor తన అనుభవమంతా రంగరించి

03 September 2007

లింగం మావ - సినిమా ticket

లింగం మావ సినిమాకెళ్లాడు. Tickets కోసం క్యూలో నిల్చున్నాడు.
అతని ముందున్న వ్యక్తి టెకెట్లు తీసుకుంటున్నాడు.
"Golden circle tickets అయిపోయాయి. Diamond circle మాత్రమే ఉన్నాయి" చెప్పాడు సినిమా హాల్ వ్యక్తి
"సరే.. diamond circle ఇవ్వండి"

ఆ తర్వాతి వ్యక్తితో....
"మిగతా tickets అన్నీ అయిపోయాయి. Only balcony"
"సరే balconyయే ఇవ్వండి"

ఇప్పుడు లింగం మావ వంతు.
"house full" చెప్పాడు హాల్ వ్యక్తి.
"సరే... house fullలోనే ఇవ్వండి" చెప్పాడు లింగం మావ

02 September 2007

నెక్లెస్

"మన పక్కింటాయనను చూడండి, పెళ్లానికి రవ్వల నెక్లెస్ కొనిపెట్టాడు" సాధింపుగా అన్నది రాణి.

"అదేం పెద్ద గొప్ప? ఆవిడ ఒప్పుకుంటే నేనూ కొని పెడతా" పెదవులు చప్పరిస్తూ అన్నడు భర్త.

01 September 2007

ఏదో ఒకటి

ఏడేళ్ళ వాసవి సీరియస్‍గా బొమ్మ గీస్తోంది
"ఏం చేస్తున్నావురా?" అడిగాడు నాన్న.
"నీ బొమ్మ వేస్తున్నాను నాన్న"
"అబ్బ గుడ్"

కాసేపటికి...


"బొమ్మ బాగా రావట్లేదు నాన్న" చెప్పింది వాసవి.
"సరేలే. వదిలేయ్"
"పోనీ తోక పెట్టేసి, కోతి అని కింద రాసేయనా?"

31 August 2007

కరువు

"ఎక్కడ? ఎక్కడ? అగ్ని ప్రమాదం జరిగిందెక్కడ?" ఫైరింజెన్ మీద నుంచి అరిచాడు ఆఫీసర్.

"అగ్ని ప్రమాదం ఏమీ లేదండయ్యా. పొద్దుట్నించీ పంపుల్లో నీళ్ళు రావడం లేదు. నీళ్ళ కోసం అలా పిలిచాం. తలా ఒక బిందెడు నీళ్ళుపోసి పుణ్యం కట్టుకోండి బాబయ్య" బిందెలు చూపుతూ అన్నారు అక్కడున్న వందమంది మహిళలు

30 August 2007

ఫలితం

భార్యను ఆశ్చర్యపరుద్దామని ఆమె పుట్టింటికి వెళ్ళి వచ్చేలోగా ఓ చీరకు ఫాలు కుట్టాడు సంతోష్.


భార్య ఎంతో సంతషించింది. గాఢంగా ముద్దు పెట్టింది.


"ఇవి కూడా కాస్త కుట్టి పెడతారా? మీకు టైమున్నప్పుడే" మరో రెండు చీరలు భర్తకిస్తూ అందామె.

29 August 2007

సీరియల్

"ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్సేమైనా చూస్తున్నావా వదినా?"

"అబ్బే... ఈ సీరియల్స్‌తో విసుగెత్తిపోయింది. వాస్తవ జీవితమే ఎంతో హాయిగా ఉంది"

"వాస్తవ జీవితమా? ఎప్పుడు మొదలైంది? ఏ ఛానల్లో వస్తున్నది? ఎన్ని గంటలకొస్తున్నది?"

28 August 2007

సులభం

"మీ ఆవిడ అలా అప్పులమీదాప్పులు చేస్తూ సామాన్లు కొంటూంటే నా ముందుఏడ్చే బదులు ఆమెకే సర్ది చెప్పవచ్చు కదా?" అన్నాడు నరసింహం.

"ఆమెకు సర్ది చెప్పేకంటే అప్పులవాళ్ళకు సర్ది చెప్పటం సులభం రా నరసింహం" దిగులుగా అన్నాడు గోవిందం.

27 August 2007

ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది

ఓ ప్రాంతంలో దొంగలు ఎక్కువగా పడుతున్నారని వార్తలొచ్చాయి. గస్తీ కోసం night watchmanను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.




  • మరి watchmanku ఉండాల్సిన అర్హత లేమిటి? పని గంటలెన్ని? ఇత్యాది విధి విధానాలు ఖరారు చేసేందుకు ఒక commiteeని వేశారు


  • ఇక watchman తన duty సరిగ్గా నిర్వహిస్తున్నాడని ఎలా తెలియాలి? అందుకని ఒక superviserని వేశారు.


  • మరి వీళ్ళిద్దరికీ వేతనాలు ఇవ్వాలి కదా? ఓ accountant మరియు time keeperనూ పెట్టారు.


  • ఇంతమందిని పర్యవేక్షించాలాంటే ఎలా? ఓ officerని వేశారు.


  • ఆ officerకి ఒక personal secretary, ఒక boy......


  • ........


తీరా చూసేసరికి budget విపరీతంగా పెరిగి పోయింది. ఉద్యాగాల్లో కోత విధించాలన్న ఉత్తర్వుల మేరకు watchmanను తొలగించారు.

26 August 2007

పాతది

"అయ్యయ్యో ఇప్పుడు మీరు పగలకొట్టిన గ్లాసు ఐదు వేల సంవత్సరాల నాటిది" ఘొల్లుమన్నాడు మ్యూజియం ఉద్యోగి పాపారావుతో.

"హమ్మయ్య... బ్రతికించారు ఇంకా కొత్తదేమోనని భయపది చచ్చాను" నిట్టూరుస్తూ అన్నాడు పాపారావు.

25 August 2007

పిట్ట సాయం

రాము సరదాగా చేపలు పట్టడానికి వెళ్లాడు. తీరా నది ఒడ్డికెళ్లాక చూసుకుంటే గలానికి అవసరమైన ఎరలు తీసుకురావడం మరిచిపోయినట్టు అర్థమైంది.



దూరంగా ఓ చిన్న పిట్ట ఎరను తింటుండం చూశాడు. ఒడుపుగా దాన్ని పట్టేసి ముక్కున ఉన్న ఎరను లాక్కున్నాడు. కాస్తంత ఆలోచిస్తే దాని నోటి దగ్గర కూడు తాను బలవంతంగా తీసేసికొన్నట్లు అనిపించింది.



తన దగ్గరున్న విస్కీని కాస్తంత దానికి పట్టించాడు. దాంతో తన గిల్టీ ఫీలింగ్ తొలగిపోగా తాపీగా చేపలు పట్టేందుకు ఉపక్రమించాడు.



కాసేపాగాక ఎవరో వెనక పొడుస్తున్నట్లు అనిపించింది. వెనక్కి చూస్తే అదే పిట్ట....

ముక్కున మరో మూడు ఎరలతో!!!!

24 August 2007

ఉచితం

"డాక్టర్ గారూ... నెను చాలా పేద వాడినండీ.... మీరడిగినంత ఫీజు ఇచ్చుకోలేను. ఎట్టాగైనా నాకు వైద్యం చేయండి బాబూ... కానీ జీవితాంతం నేను పైసా పుచ్చుకోకుండా మీ కుటుంబం అంతటికీ పని చేసి పెడతాను" వినయంగా అన్నాడా వ్యక్తి.



"సరే... ఇంతకూ నువ్వేం పని చేస్తుంటావు?" అడిగాడు డాక్టర్.



"కాటికాపరినండీ... శవాలు తగలబెడుతుంటాను" అన్నాడతను.

23 August 2007

సినిమా టైటిళ్ళు

వెంకట్రావ్ సాఫ్ట్ వేర్ నిపుణుదు. ఆయన రిజిష్టర్ చేయించిన సినిమా టాటిల్స్ ఇవీ..
  • శంకరదాదా M.C.A
  • చాట్టింగ్ చేద్దాం రా
  • ప్రోగామర్ నెం. 1
  • వైరస్ స్టోరీ
  • ఎవడి సిస్టమ్ వాడిదే
  • సంపూర్ణ "జావా"యణం
  • హ్యాకర్లకు మునగాడు
  • సాఫ్ట్ వేర్ చిన్నోడు
  • హ్యాకిరి
  • 80 జీబీ.... డాట్‍కాం కాలనీ
  • ఆపరేషన బిల్ గేట్స్
  • సీ ప్రోగ్రాం రహస్యాలు
  • మెమరీలో ఆమె జ్ఞాపకాలు
  • పాస్‍వార్డ్ లేని చిన్నది

22 August 2007

ప్రేమ

"నాకు పదిమంది పిల్లలు పుట్టిన తరువాత తెలిసింది మాఆయనకు నా మీద ప్రేమ అనేది బొత్తిగా లేదని" అంది కమల



"ఇంకా నయం ప్రేమ ఉంటే ఇంకా ఎంత సంతానభాగ్యం కలిగేదో" అంది రాగిణి.

21 August 2007

Dustbin

నలుగు ఆడపిల్లలున్న కుటుంబరావు పండక్కి ఇంటికి సున్నం వేయించాలనుకున్నాడు. సామాను బయటకు పెడుతుంటే సోఫా కుషన కింద ఈ వస్తువులు కనబడ్డాయి.


  • మూడు చిన్న దువ్వెనలు

  • ముప్పై నాలుగు గుండు పిన్నులు

  • ఐదు సూదులు

  • రెండి చీర పిన్నులు

  • ఇరవై మూడు హెయిర్ పిన్నులు

  • అప్పడాల ముక్కలు

  • నాలుగు తలనొప్పి మాత్రలు

  • ఇరవై టూత్‍పిక్స్

  • పదమూడు హుక్కులు

  • తొమ్మిది గుండీలు

  • బొట్టు బిళ్ళల ప్యాకెట్ (సగం వాడింది)

20 August 2007

చండశాసనుడు

"నేను చండశాసనుణ్ణి, ఏ చిన్న పొరబాటునూ సహించలేను. నిన్న నా భార్య కాఫీలో పంచదార తక్కువేసింది. వెంటనే దవడలు వాయించాను" అన్నాడు చిదంబరం.



"నువ్వు చాలా అదృష్టవంతుడివి గురూ. నీకు చాలా మంచి కలలు వస్తుంటాయి" తలమీద బొప్పిని తడుముకుంటూ అన్నాడు సారధి.

19 August 2007

గుడిలో

"నువ్వు ప్రతి అమ్మాయినీ ఏ పార్కుకో, బీచికో తీసుకెళ్ళకుండా గుడిలోకి తీసుకెళ్ళి 'I Love You' అని చెబుతావెందుకు?" సందేహంగా అడిగాడు శేఖర్.

"గుడిలో అయితే చెప్పులేసుకోవడానికి వీలుకాదు కదా" చెప్పాడు రాజు

18 August 2007

లింగం మావ ప్రమాణం

ఓ కేసుకు సంబంధించి లింగం మావ కోర్టులో సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది. ఆయనతో గుమాస్తా ప్రమాణం చేయిస్తున్నాడు.

"దేవుడి మీద ప్రమాణం చేసి..." చెప్పాడు గుమాస్తా

"దేవుడి మీద ప్రమాణం చేసి..." చెప్పాడు లింగం మావ



"అంతా నిజమే చెబుతాను"

"అంతా నిజమే చెబుతాను"



"నేను చెప్పినట్టే అను"

"నేను చెప్పినట్టే అను"



"అది కాదు.. నేను చెప్పినట్టు చెప్పు"

"ఏం చెప్పారు మీరు"



"అంతా నిజమే చెబుతాను"

"నిజమే చెబుతున్నాను కదా!"



"ఏమీ మాట్లాడకు... అంతా నిజమే చెబుతాను"

"సరే.."



"సరే కాదు, నేను చెప్పింది అను"

"మీరు నన్ను confuse చేస్తున్నారు"



"నేను అన్నట్టు అనవయ్యా స్వామీ"

........

17 August 2007

సెలవు

"ఈరోజు స్కూలుకు సైకిల్ మీద వస్తుంటే లారీ గుద్దిందిరా. చచ్చేవాడిని. క్షణంలో ప్రాణగండం తప్పింది" పిల్లలతో చెప్పాడు టీచర్.



"అయ్యయ్యో... ఎంత పని జరిగింది సార్.... మాకు సెలవు యోగం క్షణంలో తప్పింది" విచారంగా అన్నారు పిల్లలు

16 August 2007

వెర్రి నాయన

"అమ్మానాన్న ఆటాదుకుందామా?" పిలిచింది బుజ్జి.

"అంటే ఏమి చెయ్యాలి?" అడిగాడు చంటి.

"నేను సైగ చేస్తాను, నా మనసులో ఏముందో నువ్వు చెప్పాలి"

"నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది?"

"భలే, నాన్నా పాత్రకు నువ్వు సరిగ్గా సరిపోతావు".

15 August 2007

నిద్ర

"ఏమిటయ్యా సాయీ, ఆఫీసుకు ఇంత లేటుగా వచ్చావు?" కోపంగా అడిగాడు ఆఫీసర్.

"నిద్ర లేవటం ఆలస్యమైంది సార్" చేతులు నలుపుకుంటూ అన్నాడు సాయి.

"వాట్! ఇంటి దగ్గర కూడా నిద్రపోతున్నావా?" ఆశ్చర్యంగా అన్నాడు ఆఫీసర్.

14 August 2007

నీకే సమస్యా?

డాక్టర్ దగ్గరికి ఓ తాగుబోతు వెళ్ళాడు. "డాక్టర్... నాకు నెల్రోజుల నుంచీ నలతగా ఉంటోంది"
"అలాగా?.. కానీ అనారోగ్య లక్షణాలేమీ కనిపించడంలేదే, బహుశా ఎక్కువగా తాగడం వల్ల కావొచ్చు"
"అయితే మీరు కూడా తాగే ఉన్నారా? మత్తు దిగాక వస్తాలే".

13 August 2007

వేలం

బస్సు వెళ్తోంది. హఠాత్తుగా కనకరావు కేకపెట్టాడు.

"బాబూ.. నా పర్సు పోయింది. దాన్లో పదివేల రూపాయలున్నాయి. నా పర్సు నాకిస్తే వారికి వంద రూపాయలిస్తాను" ఏడుస్తూ అన్నాడు.

"నాకిస్తే ఐదొందలిస్తాను" మరో వ్యక్తి అరిచాడు.

"నాకిస్తే వెయ్యి"

"నాకిస్తే రెండు వేలు..."

"నాకిస్తే నాలుగు వేలు..."



"అసలెవ్వరికీ ఇవ్వకుంటే మొత్తం నావేగా" అన్నాడొక ప్రయాణీకుడు నాలుక కరుచుకుంటూ.

12 August 2007

డాక్టర్ చతురుడు

చెకప్ కోసం పిల్లలను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు దంపతులు. భర్త ఒడిలో పిల్లాడున్నాడు, భార్య ఒడిలో పాప్.
"బాబుది మీ పోలికే" నాడి చూస్తూ అన్నాడు డాక్టర్. నవ్వి ఊరుకున్నడు భర్త.
"మీ పాప చాలా ముద్దుగా ఉంది" చెప్పాడు డాక్టర్. నవ్వి ఊరుకుంది భార్య.
"వచ్చిన ప్రతివాళ్ళ్తో ఇలా ముద్దుగా ఉన్నారనే చెబుతారనుకుంటా" అన్నాడు భర్త.
"లేదు. నిజంగా నాకు నచ్చిఏనే చెబుతాను"
"నచ్చకపోతే?"
"మీ పోలికే అంటాను"

10 August 2007

అందం

"ఏంటీ వెధవ పని, అడుక్కునే వాడికెవరైనా రూపాయో, రెండో వేస్తారు. నువ్వు పది రూపాయలు వేశావేంటి?" కోపంగా అన్నడు భర్త.





"నువ్వు అచ్చం రంభలా ఉన్నావు అన్నాడు వాడు. పాతికేళ్ళనుంచి కాపురం చేస్తున్నా ఎనాడైనా ఈ విషయం కనిపెట్టారా మీరు? ఒక్కసారి చూడగానే గ్రహించాడువాడు" అన్నిది కామేశ్వరి.

09 August 2007

పోయినోళ్ళు

"మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో గాంధీ... ఒక్కో నెహ్రూ... ఒకో ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి" ఆవేశంగా పాఠం చెబుతున్నాడు మాస్టారు.



"అంటే మేమందరం చావాలనా మీ ఉద్దేశ్యం?" లేచి కోపంగా అడిగాడో విద్యార్ధి.

08 August 2007

మానసిక వేదన

"మానసిక వేదన తగ్గడానికేమైనా tablets ఉన్నాయా uncle" shop అతడిని అడిగాడో కుర్రాడు.

"ఇవిగో బాబూ.. ఈ బిళ్ళలు రెండు వేసుకుంటే ఎలాంటి మానసిక వేదనైనా చిటికలో మయమౌతుంది" బిళ్ళలిస్తూ అన్నాడు షాపతను.

"Thanks uncle" వెళ్తూ అన్నాడు కుర్రాడు.

"ఇంతకూ ఎవరికో చెప్పలేదు?" అన్నాడు షాపతను.



"మా నాన్నకే. ఇవాళ నా progress report చూపించాలి, వస్తా" వెళ్ళాడు కుర్రాడు.

07 August 2007

"పెద్ద" Family

"మాది చాలా పెద్ద Family అంటే నమ్మి పెళ్ళిచేసుకున్న తరువాత తెలిసింది మోసపోయామని" విచారంగా అన్నాడు ముత్యాలరావు.



"ఏమైంది వాళ్ళు పేదవారా?" అడిగాడు మణి.



"అంతేకాదు, ఆమెకు ఆరుగురు అన్నలు, ఏడుగురు చెల్లెళ్ళు, అమ్మమ్మ తాతయ్య, బామ్మ అట అందరూ ఒకే Familyలో ఉంటారట" భోరుమన్న ముత్యాలరావు.

06 August 2007

ఏడుపు

"ఏమండీ.... నేను చచ్చిపోతే ఏడుస్తారా?" గారంగా అడిగింది భార్య.
"హు... ఇప్పుడు నవ్వుతున్నాను గనుకనా సరోజా..." అన్నాడు భర్త.

03 August 2007

అలవాట్లో పొరపాటు

"ఏవండీ... మీ హోటల్లో మంచి గదులు ఉన్నాయా?"
"ఉన్నాయండీ"

"మంచి టిఫిన్, కాఫీ..."
"supply చేస్తాం సార్"

"భోజనం అదీ...."
"supply చేస్తాం సార్"

"కావాలంటే మందూ..."
"supply చేస్తాం సార్"

"వెరీ గుడ్... అయితే ఒక రూమివ్వండి."
రూమ్‍లో దోమలున్నాయా?
"లేవు సార్.... supply చేస్తాం సార్"

02 August 2007

తొక్క

"ఎంతోయ్ ఒక్కో అరటిపండు?" అడిగాడు శివకోటి పండ్లు అమ్మేకుర్రాడిని.
"ఒక్కోటి రూపాయి సార్" చెప్పాడతను.
"ముప్పావలాకిస్తావా?"
"ముప్పావలాకు తొక్కవస్తుంది."
"సరే.... అయితే ఈ పావలా తీసుకుని తొక్క నువ్వుంచుకుని పండు నాకివ్వు" అన్నాడు శివకోటి.

01 August 2007

వ్యాపారం

"ఏంటి వదినా... ఈ మధ్య నీవు ఇంట్లోనే బోరింగ్ పంపు వేయించుకున్నావటగా?" అడిగింది కాంతం.

"అవునే కాంతం. పాల వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం" చెప్పింది కనకం.

31 July 2007

అపరకర్ణుడు

"అయ్యా.. నా పేరు సత్యమూర్తి. ఈ చుట్టుపక్కల పది గ్రామాల్లోకెల్లా ధనవంతులు మీరు. మీరు అపర దానకర్ణులని, చేతికి ఎముక లేకుండా దనధర్మాలు చేస్తారని చాలా మంది చెప్పారు. అందువల్ల ఆశతో చాలాదూరం నుంచి వచ్చాను. ఏదైనా సాయం చేసి పుణ్యం కట్టుకోండి" కోటీశ్వరుడు విశ్వామిత్రతో మొరపెట్టుకున్నాడు.



"ఓ చిన్న సాయం చెయ్యండి. మీరు వెంటనే తిరిగి వెళ్ళి అవన్ని ఒట్టి పుకార్లని వారందరితో చెప్పండి" అన్నాడా కోటీశ్వరుడు

30 July 2007

జ్ఞాపకశక్తి

"బాబూ.. ’జ్ఞాపకశక్తి వెయ్యిరెట్లు పెంచుకోవటం ఎలా?’ అనే పుస్తకం ఉందా?" అడిగాడు రామకృష్ణ పుస్తకాల షాపులో .
"ఉంది సార్... నూట ఇరవై రూపాయలు" అన్నాడు షాపతను.
"Thank You" డబ్బులిచ్చి పుస్తకం తీసుకునివెళ్తున్నాడు రామకృష్ణ.
"Excuse me sir... చదవనప్పుడు ఈ పుస్తకం మీకెందుకు" అని అడిగాడు షాపతను.
"What?.. నేను చదవనా? ఎవర్న్నారు?" కోపంగా అన్నాడు రామకృష్ణ.
"ఇదే పుస్తకం మీరు గతంలో నాలుగుసార్లు కొన్నారు!!!" గుర్తు చేశాడు షాపతను.

20 July 2007

ముందుగా

"ఆఁ..... ఏవోయ్ వెంకట్రావ్! రాత్రి ఎనిమిదైంది. అసలే కొత్తగా పళ్ళైనవాడివి. ఇంటికి వెళ్ళాలనిపించడంలేదా? ఇంకా పని చేస్తూనే ఉన్నావు?" మెచ్చుకోలుగా అన్నాడు officer.
"ఏం లేదు సార్. మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. ముందుగా ఎవరైతే ఇంటికి చేరుతారో వాళ్ళు వంట చేయాలి" రహస్యం చెప్పాడు వెంకట్రావు.

మలుపులు

"ఏంటమ్మా ఇది? మీ కథల్లో దాదాపు ప్రతి పేరాలోనూ స్కూటర్ మలుపు తిరిగింది, కారు మలుపు తిరిగింది, అతను మలుపు తిరిగాడు లాంటి వాక్యాలు కనిపిస్తున్నయి?" రచయిత్రి సులోచనతో అన్నాడు ఎడిటర్.
"అదేంటి సార్.... కథల్లో ఎన్నో మలుపులుండాలని మీరే కదా అన్నారు?" కళ్ళు విశాలం చేస్తూ అన్నది సులోచన.

18 July 2007

గెడ్డం

"నేను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు గెడ్డంగీస్తాను. మరి నువ్వురా సుధాకర్" అడిగాడు గోవిందరావు.
"ఓ నలభై, ఏభై సార్లు" చెప్పాడు సుధాకర్.
"ఏంటి... అన్నిసార్లా... నీకేమైనా పిచ్చా?"
" కాదురా... ఈమధ్య సెలూన్ స్టార్ట్ చేశాను"

పెళ్ళికి తొందర

తనకు తొందరగా పెళ్ళి చెయ్యమని, లేకపోతే ఎవరితోనైనా లేచిపోతానని అమ్మాయి warning ఇచ్చిందండీ" విచారంగా చెప్పింది అన్నపూర్ణ.
"అప్పుడే ఏం తొందర దాని పెళ్ళికి?" ఆశ్చర్యంగా అన్నాడు సహదేవరావు.
"దానికి బట్టలుతుక్కోవడం చాలా శ్రమగా ఉందట" చెప్పింది అన్నపూర్ణ.

నిద్ర

"నాకీ మధ్య నిద్ర సరిగ్గా పట్టడం లేదండీ" Doctorతో అనాడు సూరిబాబు.
"ఏదైనా government ఉద్యోగం సంపాదించండి. మీసమస్య తీరుతుంది." చెప్పాడు Doctor.

రక్షించండి

గండిపేట చెరువు దగ్గర - "రక్షించండి... రక్షించండి... మా అక్క నీళ్ళలో మునిగిపోయింది" పన్నెండేళ్ళ రవి కేకలు పెట్టాడు.
వెంటనే నలుగురు యువకులు నీటొలో దూకి ఒక ముసలమ్మను బయటకు తెచ్చారు. ఎంత వెతికినా అక్కయ్య కనిపించలేదు.
"సారీ బాబూ.... మీ బామ్మను మాత్రమే రక్షించగలిగాం. అక్క కనిపించలేదు" విచారంగా అన్నారు యువకులు.
"Thanks uncles.. మునిగిపోయింది మా బామ్మే" అన్నాడు రవి.
యువకులు తెల్లముఖాలు వేశారు.

16 July 2007

ఉత్తరాలు

"కేవలం ఉత్తరాలు రాస్తూ బతుకుతున్నావా? నీ ఉత్తరాలు అంత విలువైనవా? ఏ మ్యాగజైన్సుకు?" కుతూహలంగా అడిగాడు ఆంజనేయులు.

"అవును. డబ్బు పంపమని మానాన్నకు రాస్తూంటాను" నిబ్బరంగా చెప్పాడు రమణ.

(దీన్నే కాస్త modernగా ...

"ఏమిటి కేవలం computer మీద బతుకుతున్నావా? బ్లాగులు వగైరా రాస్తున్నావా ఏమిటి?" కుతూహలంగా అడిగాడు రాజ్.
"అవును. డబ్బు online transfer చెయ్యమని మా Daddyకి E-mail పంపిస్తూ ఉంటాను" నిబ్బరంగా చెప్పాడు అరవింద.)

చినగదు

"సార్.... ఈ షర్టు గుడ్డ తీసుకోడి. అస్సలు చినగదు" తాను చూపుతూ అన్నాడు Salesman.
"గుడ్డ చాలా బాగుంది. కానీ వద్దులే" అన్నాడు అప్పారావు.
"అదేం సార్.. పెద్ద ఖరీదేం కాదు"
"ఖరీదు సంగతి కాదు. నాకు రెండు మీటర్లు చాలు. కానీ చినగదంటున్నావు కదా! ఎలా చించిస్తావు?" అడిగాడు అప్పారావు.

వయసు

"అబ్బ... డాక్టర్ రావు నిజంగా ధన్వంతరే. మాఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్ని ఒక్క దెబ్బకు పోగొట్టాడు" సంతోషంగా చెప్పాడు చిదంబరం.
"ఏం మందిచ్చాడేం?" కుతూహలంగా అడిగాడు ఏకాంబరం.
"వయసు పెరుగుతున్నది కదా. అందుకే అలసట అన్నడు. అంతే! మర్నాటి నుంచి నలుగురు మనుషుల పని చకచక చేస్తున్నది" అన్నడు చిదంబరం.

అనుభవం

"మొన్న ఒక పత్రికలో మీ కథ చదివాను. నా కంటే మీరు చిన్నవారైనా అనుభవం మాత్రం పెద్దది" తోటి రచయితతో అన్నాడు సాటి రచయిత.
"ఏం అలా అంటున్నారు?"
"ఏం లేదు. నేను ముప్పై సంవత్సరాల నాటి కథలు కాపీ కొడితే మీరు ఏభై సంవత్సరాల నటి కథలు కాపీ కొడుతున్నారు."

15 July 2007

రైలు ప్రయణం - పెళ్ళికి ముందు, తరువాత

పెళ్ళికి ముందు

రాము, సీతల పెళ్ళి నిశ్చితార్ధం అయిపోయింది. ఇద్దరూ హైదరాబాదులో software ఉద్యోగం. వాళ్ళ కుటుంబాలు (అమ్మా, నాన్నలు మటుకు విశాఖపట్టణంలో). ఒక weekend ఇద్దరూ విశాఖపట్టణం కలిసి వెళ్తున్నారు.



సమయం : 22:00 hrs

సీత : ఏంటి ఇంత త్వరగా station కి వచ్చారు?

రాము : నేను మామూలుగా రైలు 22:30 కి అంటే 22:00 కల్లా station కి వచ్చేస్తాను.

రాము : సరే. నేను అలా వెళ్ళి water bottle కొనుక్కొని వస్తాను.

సీత : సరే



ఒక రెండు నిమిషాల తరువాత రాము పరుగెత్తుకుంటూ వస్తాడు. Water bottleతో పాటు చిన్ని చిన్ని గుండెలు (brittania little hearts) biscuit packet కూడా తీసుకు వచ్చాడు.



సీత : ఎందుకు అలా పరుగెత్తి వస్తున్నారు? మెల్లగా రావచ్చు కదా?

రాము : మ్.. అంటే.. నువ్వు ఒక్క దానివే ఉన్నావు కదా. అందుకని.

సీత : అయ్యో.. అసలు ఎప్పుడూ నేను ఒక్కదానినే ప్రయాణం చేస్తాను. ఇదే మొదటిసారి ఇంకొకరితో కలిసి వెళ్ళటం.

రాము : సరే పద వెళ్ళి రైల్లో కూర్చుందాము.



రాము, సీత రైలు ఎక్కుతారు.



సీత : side upper side lower book చేసారా?

రాము : అవును. ఇలా అయితే హాయిగా ఎదురు ఎదురుగా కూర్చుని ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు.

అవీ ఇవీ అన్నీ మాట్లాడుకుంటున్నారు. మిగతా ప్రయాణికులు అంతా నిద్రపోయారు కానీ వీళ్ళు మాత్రం మాట్లాడుటూనే ఉన్నారు. ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చి " మీరు కొంచెం మెల్లగా మాట్లాడుకోండి. మా నిద్రను disturb చేస్తున్నారు".

సరే అని రాము, సీత తలుపు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గంటెసేపు కూర్చి, మాట్లాడుకుని వచ్చి తమ తమ berth ల లో పడుకున్నారు.


పెళ్ళైన తరువాత

పెళ్ళైన తొమ్మిది నెలల తరువాత మళ్ళీ రాము, సీత ప్రయాణమయ్యారు. ఇద్దరూ train ఎక్కారు.

సీత : ఏ బెర్త్??

రాము : రెండు upper berths book చేసాను (మనసులో వెధవ నస ఉండదు)

సీత : హమ్....

రాము : సరే water bottle ఇవ్వు.

సీత : water bottle లేదు. Stationలో కొందామని అనుకున్నాను.

రాము : ముందే చెప్పి ఏడవచ్చు కదా? ఇప్పుడు చూడు train బయలుదేరడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉన్నది.

సీత : మీరు ఇలానే అనుకుంటూ కూర్చుంటే, ఆ 5 నిమిషాలు కూడా ఉండదు.

రాము : (ఛీ ఎధవ బతుకు)

రాము : పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తాడు. (ఈ సారి నీళ్ళు మాత్రమే. చిన్ని చిన్ని గుండెలు లేవు)

train time అయ్యింది , బయలు దేరింది.

సీత (ఆవిలిస్తూ) : సరే నేను బాగా అలసిపోయి ఉన్నాను. నేను పడుకుంటున్నాను.

రాము : సరే పడుకో. (కొంచెం సేపు నేను ప్రశాంతంగా ఉండచ్చు)

TC వచ్చి ticket సరి చూసిన తరువాత రాము కూడా నిద్ర పోవడానికి ఉపక్రమించాడు. కానీ ఎంతకీ నిద్ర పట్టడంలేదు. పక్కనే side upper ,side lower berth లో ఉన్న జంట మాట్లాడుకుంటున్నారు.

ఆ జంట సరేనని, మెల్లగా train తలుపు వైపు వెళ్ళి .........

****************************

జీవిత ప్రయాణం అలా సాగిపోతుంటుంది.....

coffee

"ఏంటీ? మామూలు కాఫీ రెండు రూపాయలు. స్పెషల్ కాఫీ ఆర్రూపాయలా? ఏంటో స్పెషల్?" సర్వర్ని అడిగాడు సుందరం.

"అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీకు మెదటిసారి కఫీ ఎలా ఇస్తారో మా స్పెషల్ కాఫీ ఎప్పుడూ అలాగే ఉంటుంది" చెప్పాడు సర్వర్.

పేరు

Interview జరుగుతున్నది.
"మీ పేరు?" అడిగాడు అధికారి.
"శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీ...శ్రీనివాస్ సర్" చెప్పాడు అభ్యర్థి.
"ఏంటి... అన్ని శ్రీ లెందుకు మీకు?"
"న...న...న...న...న... నాకు నత్తి సార్"

ఇంటివాడు

చిలకజోస్యం చెప్పేవాడి మీద మండిపడిపోతున్నాడు జగన్నాధం "ఏం జ్యోతిష్యమండీ మీ బొంద! త్వరలో నేనొక ఇంటివాడినౌతానన్నారు. సంవత్సరం తిరిగినా పెళ్ళి కాలేదు సరి కదా అప్పులెక్కువై ఉన్న రెండు ఇళ్ళలో ఒక ఇల్లు అమ్మి వేయవలసి వచ్చింది" అన్నాడు.

"మరింకేమండీ! ఇప్పుడు మీరు ఒక్క ఇంటివారే కదా! నా జ్యోతిష్యాన్ని తిడతారేం?" అన్నాడు జ్యోతిష్కుడు.

అలవాటు

ఆరుద్ర, ముళ్ళపుడి ఒకరికొకరు ఎదురయ్యారు.
"సిగరెట్స్ తాగడం మానేశాను" అన్నాడు ఆరుద్ర.
"అదేం పెద్ద గొప్ప? నేను అలా చాలాసార్లు మానేశాను" అన్నారు ముళ్ళపుడి.

13 July 2007

నువ్వు నాకు నచ్చావు - పేరడీ కవిత, ప్రార్ధన

కవిత
నాన్న...

గుర్తు చేసుకోవడానికి వంశం ఇచ్చావ్....
కొట్టుకోవడానికి పెద్ద పెద్ద తొడలు ఇచ్చావ్....
జనాలని హింసించదానికి దిక్కుమాలిన సినిమాలనిచ్చావ్....
మమ్మల్ని భరించడానికి నిర్మాతలనిచ్చావ్....
ఏమైనా చేసుకోవడానికి విజయశాంతినిచ్చావ్....
మాలో మేము తన్నుకోవడానికి చానా తోబుట్టులనిచ్చావ్....

నాన్న....(ఏడుపు కళ్ళతో)
పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న అక్కా బావల నిచ్చావ్....
అడక్కుండానే పిన్నిని ఇచ్చావ్....
ఎలాంటి నినిమాలు తీసినా భరించే అభిమానులనిచ్చావ్....

చివరకొస్తే....
నిర్మాతలని కాల్చేయడానికి గన్నిచ్చావ్....
కానీ ఎందుకు నాన్నా ఇంత తొందరగా చచ్చావ్....
అయినా నువ్వు నాకు నచ్చావ్....

****************
ప్రార్ధన


దేవుడా.....
ఓ మంచి దేవుడా.....
నువ్వు నాకు ఫ్లాప్ అవ్వడానికి

  • జాన్నీ ఇచ్చావ్.....

  • గుడుంబా శంకర్ ఇచ్చావ్....

  • బాలు ఇచ్చావ్.....

  • బంగారం కూడా ఇచ్చావ్....


ఇలాగే మన స్టేట్‍లో ఉన్న ఏడుగురు హీరోలకి ఇస్తావని.....
అలాగే మన countryలో ఉన్న 150 మంది హీరోలకి....
అదే చేత్తో ప్రపంచంలో ఉన్న ????? - నాకు number correctగా తెలియదు.....
ఎంత మంది ఉంటే అంతమందికీ ఇవే flops ఇస్తావని
అంటే as it is గా ఇవే flops కాదు...
వాళ్ళు ఏ సినిమా తీస్తే ఆ సినిమా

  • స్టాలిన్

  • అశోక్

  • మున్నా

  • సైనికుడు

  • విక్రమార్కుడు

  • ....


అలాగే ఇస్తావని కోరుకుంటున్నాను.....
నువ్వు ఇస్తావ్ నాకు తెలుసు....
ఎందుకంటే... basically you are GOD....
you are very good GOD....
అంతే....That's all....
నా ప్రార్ధన మీ అందరికీ కొంచెం కొత్తగా అనిపించొచ్చు....
************

బరువు

Doctor వద్దకు పరుగుతో వచ్చాడు కవిరాజు.
"dcotor.. doctor... రేపు సాయంత్రం ఆరుగంటలలోగా నేను కనీసం 20 కిలోల బరువు పెరగాలి. ఏవైనా మంచి మందులు చెప్పండి" రొప్పుతూ అన్నాడు.

"ఇదేంటి కవిగారూ... అందరూ బరువు తగ్గడానికి మందులకోసం వస్తారు. మీరు పెరగాలంటారేంటి?" ఆశ్చర్యంగా అన్నాడు doctor.

"శివం సంస్థవారు రేపు నాకు సన్మానం చేసి రూపాయి నాణాలతో తులాభారం తూస్తారట" చెప్పాడు కవి.

ఇల్లు ఇల్లాలు

"ఏంరోయ్ సీతారాం. మొన్న మీ ఇంటికొస్తే తాళం వేసుంది. ఇల్లేమైనా మారావా?" బజార్లో అడిగాడు రాజారాం.
"ఆ.... అదేం లేదురా! ఎన్నేళ్ళు పోయినా అదే ఇల్లు, అదే ఇల్లాలు" నవ్వుతూ అన్నాడు సీతారాం.

12 July 2007

తెల్ల వెంట్రుక

"ఇవాళ వంట నువ్వు చేశావా అమ్మా?" అడిగాడు కొడుకు.
"ఎలా కనుక్కున్నావురా?" అడిగింది తల్లి.
"చారులో పొడవాటి తెల్ల వెంట్రుక వచ్చింది. నాన్నిది బట్టతల కదా" చెప్పాడు సుపుత్రుడు.

Biscuit

"వెధవా.. దున్నపోతా... నెత్తిమీదకు పదేళ్ళు వచ్చాయి. చెల్లెలికి biscuit చిన్న ముక్క ఇచ్చి పెద్దది నువ్వు తింటూ దాన్నేడిపిస్తున్నావా? వెధవా కాకి చూడు, ఆహారం తెచ్చి ముందు పిల్లలకిచ్చి తరువాత తాను తింటుంది" టింకూను మందలిస్తున్నది రాజేశ్వరి.

"కాకి తినెది ఎంగిలి మెతుకులు. అవైతే నేనూ మొత్తం చెల్లికే ఇచ్చేవాడిని" అన్నాడు టింకు.

11 July 2007

నమ్మకం

"ఏదమ్మా.. ఈ బెడ్ మీద పడుకో. పరీక్ష చేస్తాను" అన్నాడు డాక్టర్ మన్మధరావు.
"మనతో పాటు మీ నర్స్ కూడా ఉంటే బాగుంటుంది డాక్టర్..." అన్నది కామేశ్వరి.
"అదేంటమ్మా.... నామీద నమ్మకం లేదా?" బాధగా అన్నాడు డాక్టర్.
"మీ మీద కాదండి. బయటున్న మాఆయనకు నా మీద నమ్మాకం లేదు" చెప్పింది కామేశ్వరి.

బాధ

ఫుల్‍గా తాగి ఇంటికొచ్చాడు పరమేశం.
"ఏంటండీ.... రాత్రి పన్నెండయింది. పైగా మన పెళ్ళిరోజు. ఇలా తాగొచ్చారేంటీ" కోపంగా అంది అంబిక.
"అవును అంబీ... ఆ బాధను మర్చిపోవడానికే ఇలా తాగొచ్చాను" సోఫాలో కూలబడుతూ అన్నాడు పరమేశం.

10 July 2007

రచయిత్రి

"నా నవల వెలుగులోకి రావడానికి 20 సంవత్సరాలు పట్టింది" చెప్పింది రచయిత్రి కామాక్షి.
"అబ్బా.. చాలా కష్టపడ్డారన్నమాట" అన్నాడు విలేఖరి.
"అవును రాయడం వారం రోజుల్లో అయింది. Publisher వెతకడానికి 20 సంవత్సరాలు పట్టింది" అన్నది కామాక్షి.

బెలూన్

నాదస్వర విద్వంసుడు నారదన్ వరండాలో కూర్చుని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఓ బాలుడు వచ్చి నమస్కరించాడు.
"శుభమస్తు.. ఏం బాబూ నాదస్వరం నేర్చుకుంటావా? నెలకు నాలుగు వందలౌతుంది" అన్నాడు నారదన్.
"లేదంకుల్.. నా బెలూన్ ఎంతసేపు ఊదినా గాలి పోవడం లేదు. కొంచెం గాలి ఊది పెడతారేమోనని వచ్చాను" అన్నాడు.

09 July 2007

అగ్ని ప్రమాదం

ఒక పెద్ద భవనం మంటల్లో ఆహుతైపోతున్నది. అప్పారావు అటుగా వెళ్తున్నాడు.
"అయ్యో..... అయ్యో... ఆ భవనం అలా కాలిపోతుంటే అలా చోద్యం చూస్తారేంటి. వెంటనే Fire stationకి phone చెయ్యండి" అరిచాడు.
"ఆ కాలిపోయేది Fire Stationఏ నాయనా" బదులిచ్చాడో ఆసామి.

08 July 2007

రామదాసు

Teacher : రామదాసు అసలు పేరేంటి రవీ!
రవి : అక్కినేని నాగార్జున teacher.

సినిమా

Teacher : ఏంట్రా గోపీ! తలనొప్పి, రొంపమ్ దగ్గు అని బడి ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళావట?
గోపీ : అవును Teacher. సినిమా ADsలో ఏ మందు వేసుకోవాలో చూపిస్తారని.

07 July 2007

చూస్తూ

"సిగ్గులేని వెధవా! ఆ ఎదురింట్లో అనూరాధను చూడు. 95 percent తెచ్చుకుంది. నువ్వు డిమ్కాకొట్టావు. అసలా అనూరాధ...." కొడుకు మీద కేకలేస్తున్నాడు కోదండం.

"ఎందుకు పదిసార్లు అనూరాధ, అనూరాధ అని జపం చేస్తావు. ఆ అనూరాధను “చూసి చూసే” ఈ గతి పట్టాను" చెప్పాడు కొడుకు.

లాంఛనాలు

"అల్లుడుగారూ.. కట్నం విషయం కుదిరింది కాబట్టి లాంఛనాల విషయం మాట్లాడుకుందాం. Scooter, Colour TV, ఇవ్వాలనుకుంటున్నాం ఏవంటారు?" కాబోయే అల్లుడిని అదిగాడు రామనాధం.

"ఎందుకండీ నా కలాంటివేమీ వద్దు. ఒక washing machine, ఒక grinder ఇప్పించండి చాలు. నాకు పని తప్పుతుంది" అనాడు “ముందుచూపుతో” నారాయణ.

దగ్గు

రాఘవయ్య అర్దరాత్రి లేచి విపరీతంగా దగ్గుతున్నాడు.
అరగంట సేపు దగ్గిన తరువాత భార్యకు మండిపోయింది.
"అబ్బబ్బ... మీదగ్గు వినలేకపోతున్నాను" అన్నది.
"నన్ను మాత్రం ఏమి చేయమంటవు. ఇంతకన్న పెద్దగా దగ్గటం నావల్ల కాదు. ఖళ్ ఖళ్ ఖళ్...."

చదువు

ఇద్దరు మిత్రులు తిరుమల ఘాట్ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక పులి ఎదురొచ్చింది. ఇద్దరూ వణికిపోయారు.

"భయపడకు ఆనంద్.... Suddenగా పులి ఎదురొచ్చినప్పుదు చేతులు రెండు పక్కలకు జూపి దిష్ఠి బొమ్మలా కదలకుండా నిలుచుంటే పులి ఏమీ చేయదని మొన్న ఒక పత్రికలో చదివాను." ధైర్యం చెప్పాడు సంజీవి.

"నువ్వు చదివావు సరే. మరి ఆపులి ఆ పత్రిక చదివిందా అని" వణుకుతూ అన్నాడు ఆనంద్.

రహస్యం

భజగోవిందం మీద ఆవేశంతో ఊగిపోతున్నాడు ఆంజనేయులు. "అసలేమిటి మీ ఉద్దేశ్యం? నేను ఒఠ్ఠి అవినీతిపరుడినని, ముండల ముఠాకోరునని, రేసులాడతానని, తాగుతానని, తాగొచ్చి పెళ్లన్ని తంతానని నా మీద ఊరందరికీ చెబుతున్నారట!"

"క్షమించండి సార్.... ఇవన్నీ రహస్యాలని ఇంతవరకూ నాకు తెలియదు" చల్లగా అన్నాడు ఆంజనేయులు.

ఆటగాడు

"మంచి ఆటగాడు అని చెపితే ఏదో పెద్ద player అని పెళ్ళి ఛెశుకున్నా. తీరా చేసుకున్న తరువాత తెలిసింది" విచారంగా అంది సుమలత.
"ఏమైంది? మరి ఆటగాడు కాదా అతను" అడిగింది శ్రీదేవి.
"ఆటగాడే.... తోలుబొమ్మల్ని ఆడిస్తుంటాడటా పల్లెటూర్లలో.." ఏడ్చింది సుమలత.

06 July 2007

పరాయి స్త్రీ

"నేను పరాయి స్త్రీని తల్లిలా భావిస్తాను" గొప్ప చెప్పుకున్నాడు రాజేష్ తన Hi-tech loverతో.
"ఏఁ.. మీ నాన్న నీకు ఏ అమ్మాయినీ ప్రేమించడానికి ఛాన్స్ ఇవ్వడా?.... తనే ముందు enter అవుతాడా!!!?" అంటూ అనుమనంగా అడిగిందా Hi-tech lover.

సామెతలు - ప్రేమ, పెళ్ళి

"ఆలస్యం అమృతం విషమంటే?"
"త్వరగా ప్రేమించు అని".
"మరి.. నిదానమే ప్రధానమంటే?"
"కాస్త ఆలోచించి పెళ్ళి చేసుకో అని".

Parking

"సార్... ఇక్కడ scooter park చేసుకోవచ్చా?" ఒక centerలో policeని అడిగాడు చక్రవర్తి.
"Sorry.... ఇది no parking zone", చెప్పాడు police.
"మరిక్కడ వంద scooterలు ఉన్నాయ్?"
"వారెవరూ మీలా నన్ను అడగలేదు" చెప్పడు police.

తెలివితేటలు

"రాధా రాధా.... మన్ బుజ్జిపండు మాటలు విన్నావా? చూడు రెండేళ్ళకే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో! నా తెలివితేటలన్నీ వీడికి వచ్చాయి" సంతోషంగా అన్నాడు రమేష్.
"అవును నిజమే. నా తెలివితేటలన్నీ నా దగ్గరే ఉన్నాయి" అన్నది రాధ.

Steel సామాను

"ఏమిటండీ.... suitcase నిండా బట్టలన్నీ సర్దుకుంటున్నారు. ఏదైనా campకి వెళ్తున్నారా?" అడిగింది లత భర్తని.
"Camp ఆ నా బొందా? Steel సామాన్లవాడిని నేను officeకి వెళ్ళగానే రమ్మన్నావుగా. అందుకె నాజాగ్రత్తలో నేనుండాలి" బయలుదేరాడు శ్రీధర్.

మాయం

"రెండు గంటల నుంచి నీతో మాట్లాడుతుంటే అస్సలు కాలం తెలియడం లేదు. నా తలనొప్పంతా మాయమైపోయింది." అన్నడు ధర్మారావు.
"ఓ! ఇప్పుడర్థమైంది. నా తలలోకి వచ్చిన నొప్పి మీదేనా?" తలపట్టుకుని అన్నాడు అర్జున్రావు.

పిసినారితనం

"పిసినిగొట్టుతనానికి ఓ హద్దు అదుపు ఉండాలి. మూరెడు మల్లెపూలు తెమ్మంటే పావలా పెట్టి పది విడి పూలు తెస్తారా?" కోపంగా అన్నది రోహిణి.
"సర్లే, ఈపూలను Fridgeలో పెట్టి రోజుకొకటి జడలో గుచ్చుకో" అన్నాడు శాంతారాం.

సిగ్గు లేదా?

Judge : మళ్ళీ మళ్ళీ courtకి రావటానికి నీకు సిగ్గు లేదా?
నేరస్థుడు : మరి మీకు? నేను అప్పుడప్పుడు మాత్రం వస్తున్నాను. మీరు రోజూ వస్తున్నారుగా?

ఎలా వెళ్ళాలి

"సార్.. సార్... Barber shopకి ఎలా వెళ్ళాలి" అని అడిగాడు ఊరికి వచ్చిన్ గిరిబాబు ఒక పెద్దమనిషిని.
"జుట్టు బాగా పెంచుకుని వెళ్ళాలి." చెప్పాడా పెద్దమనిషి.

తెలుసుకుందామని....

రామనాధం, జోగినాధం సువర్చలగారింటికి వెళ్ళారు. గేటు వేసి ఉంది.
"జోగినాధం.... లోపలికెళ్ళి సువర్చల గారున్నారేమో చూడూ" అన్నాడు రామనాధం.
"అమ్మో... వాళ్ళింట్లో పెద్ద కుక్క ఉన్నది. మీద పడి పీకుతుంది." భయంగా అన్నాడు జోగినాధం.
"అది తెలుసుకుందామనే గదా నేను నిను అడుగుతున్నది...." అన్నడు రామనాధం

05 July 2007

పుట్టిన రోజు

Teacher : ఒరేయ్ రాము! నీ పుట్టిన రోజు ఎప్పుడు?
రాము : August 14 న teacher.
Teacher : ఏ సంవత్సరం?
రాము : ప్రతి సంవత్సరం.
Teacher : !!!!!

అమ్మావా??

ఒక రచయిత : నేనీ మధ్య T.V serials కూడా కథలు రాసి అమ్ముతున్నాను, తెలుసా?
శ్రోత : ఇంతవరకు ఏమైనా అమ్మావా?

రచయిత : ఆ!....., ఒక వాచీ, ఉంగరం...

మిగిలింది

భార్య : చూశారా! నాఉపవాసాల ఫలితం! ఈ నెల బియ్యం ఖర్చు రెండువందల రూపాయలు మిగిలింది.
భర్త : అవుననుకో! కాని.. పళ్ళషాపు వాడికి మాత్రమే ఇంకా ఓ వెయ్యి రూపాయలు బాకీ ఇవ్వాల్సి ఉంది.

లోపం

"పెళ్లయి పదేళ్ళయినా పిల్లలులేరని Doctorని కలిశాం" చెప్పింది లక్ష్మి.
"ఏమన్నాడు?" ఉత్సాహంగా అడిగింది మాల.
"నలభై రకాల పరీక్షలు చేయించాడు. ఆర్నెల్ల మందులు వాడించాడు. అయినా ఫలితం కనిపించలేదు"
"ఇంతకూ లోపం ఎవరిలో ఉందని నీ అనుమానం?"
"Doctorలో ఉందనుకుంటున్నాను" నిమ్మళంగా అన్నది లక్ష్మి.

బరువు

"ఏమే దుర్గ... ఈ మధ్య బరువు తగ్గాలని నెలరోజుల నుంచీ గుర్రపు స్వారీ చేస్తున్నావటగా? ఏవైనా బరువు తగ్గావా ?" ఆశగా అడిగింది పార్వతి.

"హు.... ఏం తగ్గడమో ఏమో? మా గుర్రం మాత్రం ఇరవై కేజీలు బరువు తగ్గింది" నిట్టూరుస్తూ చెప్పింది దుర్గ.

Paper

"ఇదేంట్రా పోయిన వారం weekly చదువుతున్నావు?" అడిగాడు రామేశం.
"ఇదివరుకుట్లా weekly కొనడం మానేశానోయ్. ప్రతి వారం పత్రిక కొనగానే చుట్టుపక్కలున్న ప్రతి గాడిద అడిగేవాడే. విసుగెత్తి మానేశాను." చెప్పాడు కామేశం.
"మరి ఈ weekly ఎవరిది?".
"పక్కింటి వారిది. ఇప్పుడే అడిగి తెచ్చాను."

04 July 2007

ప్రశాంతం

"పెళ్ళై ఏభై ఏళ్ళు కాపురం చేసిన తరువాత ఇప్పుడు భార్యకు విడకులివ్వాలనుకుంటున్నారా? నాలుగైదేళ్ళలో మీరు కూడా చావబోతున్నారు?" కోపంగా అడిగాడు Judge.

"చచ్చేముందైనా కాస్త ప్రశాంతంగా చద్దామని యువరానర్" దవడలాడించాడు తాతారావు.

కల

"మాంఛి సినిమా తారలు కలలోకి రావాలని దేవుడిని ప్రార్థించి పడుకున్నాను" అన్నాడు పండు.
"మరి వచ్చిందా?" కుతూహలంగా అడిగాడు నరసింహుడు.
"రాక రాక తెల్లవారుఝామున ఒక కల వచ్చింది" చెప్పాడు పండు.
"ఇంకేం. దేవుడు నీ మొర ఆలకించాడన్నమాట" అన్నాడు నరసింహుడు.

"నా బొంద ఆలకించడం. శాంతకుమారి, ఋష్యేంద్రమణి వచ్చారు" అని అన్నాడు పండు.

చెముడు

"Doctor గారూ. నాలుగేళ్ళ నుంచి బ్రహ్మ చెముడు పట్టుకుంది. చెవి పక్క Bomb పేలినా వినపడి చావడం లేదు. ఎలాగైనా తగ్గేలా చెయ్యండి బాబూ మీకు పుణ్యం ఉంటుంది" బతిమాలాడు పుల్లయ్య.

"అదెంత భాగ్యమోయ్! నా పని అదే కదా. కాకపోతే రెండు వేల రూపాయలు నా Fees అవుతుంది" చెప్పాడు Doctor.

"బాబ్బాబు... చచ్చి మీ కడుపున పుడతాను. పిల్లలు కలవాణ్ణి. అంతిచ్చుకోలేను ఓ మూడు వేలల్లో పని అయ్యేట్లు చూడండి." Doctor కాళ్ళు పట్టుకున్నాడు పుల్లయ్య.

అప్పు

"సుబ్రావ్ చచ్చే ఇబ్బందుల్లో ఉన్నాను. ఇంటినిండా బంధువులున్నారు ఓ వెయ్యి రూపాయలు urgentగా కావాలి. ఎవర్నడగాలో తోచక ఛస్తున్నాను" అన్నాడు ప్రసాద్.

"హమ్మయ్య బతికించావు. ఇంకా నన్ను అడుగుతావేమోనని హడలి ఛస్తున్నా" పారిపోతూ అన్నాడు రఘు.

03 July 2007

మంత్రం

"ఈ మధ్య మీ ఆవిడ నువ్వు ఏమన్నాసరే దించిన తల ఎత్తడం లేదా? What a wonder! ఏం మంత్రం వేశావ్?" ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్.

"ఏం లేదు. నువ్వు తల ఎత్తినప్పుడు అరవై ఏళ్ళ బామ్మలా, తలదించినప్పుడు ఇరవై ఏళ్ళ అప్సరసలా ఉన్నావన్నా. అంతే!" చెప్పాడు రాజు.

Family Planning

"Doctor గారూ ఇప్పటికి అరడజను మంది పిల్లలతో ఛస్తున్నాను. Operation చేయించుకుంటే బాగుంటుందేమో! నేను చేయించుకోవటం మంచిదేనా?" అడిగాడు శ్రీధర్.

"Oh Yes.... ఎందుకైనా మంచిది మీతోపాటు మీ ఆవిడను కూడా చేయించుకోమని చెప్పాండి" పరధ్యానంగా అన్నాడు Doctor.

శపథం

"నా జీవితంలో వెయ్యిమందిని పేకాట, తాగుడు, వ్యభిచారం దురలవాట్లున్నవారిని ఆ అలవాట్లు మాన్పిస్తానని భీకర శపథం చేశాను" అన్నాడు బ్రాందిమూర్తి.

"Very good.... చాలా మంచి పని. మరి ఎవరిచేతైనా అలామాన్పించావా?" అడిగాడు కృష్ణమూర్తి.

"ఇప్పటికి 999 మంది చేత ఆ అలవాటు మాన్పించాను"

"అద్భుతం! ఇంకొక్కడేగా మిగిలింది! అది కూడా పూర్తి చేయకపోయావా?"

"అదే చూస్తున్నా. నేను కూడా మానేద్దామా, వద్దా అని" గొణిగాడు బ్రాందిమూర్తి.

02 July 2007

ఈ bus ఎక్కడికి వెళ్తుంది

"ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది? " అని conductor ని అడిగాడు ఒక ప్రయాణికుడు.
"గుంటూరు వెళ్తుంది" అని బదులిచ్చాడు conductor.
"మరి board మీద విజయవాడ అని రాసి ఉంది కదా?" అని ప్రశ్నించాడు ప్రయాణికుడు.
"నువ్వు బస్సెక్కి వెళ్తావా? లేక బోర్డ్ ఎక్కి వెళ్తావా?" అని కసురుకున్నాడు conductor.

అచ్చొచ్చేది

"మా వాడికి అన్ని subjects లోనూ గుండు సున్నాలొస్తున్నాయి. వాడెలా బాగుపడతాడో అర్థం కావడం లేదు" విచారంగా అన్నాడు నారాయణ.

"దానికంత విచారం దేనికిరా? కోడిగుడ్ల వ్యాపారంలోకి దించు రాణిస్తాడు" చెప్పాడు సీతాపతి.

మళ్ళీ

"ఏంటీ? నాకు మళ్ళీ operation చెయ్యాలా? అదేం? నిన్ననే చేసిన operation success అన్నారుగా?" భయంగా అన్నాడు Patient.
"భయపడకోయ్... operation success అనేదాంట్లో అణుమాత్రం సందేహం లేదు. కానీ నిన్న operation చేస్తున్నప్పుడు మా doctor గారి రత్నాల ఉంగరం మీ పొట్ట్లో జారి పదిపోయిందట" చెప్పాడు compounder.

01 July 2007

అవకాశం

వెంకట్రావు పెళ్ళి చూపులకు వెళ్ళాడు. సుందరి సిగ్గు పడుతూ చాప మీద కూర్చుంది. పిల్ల నచ్చింది అన్నాడు వెంకట్రావు.

"చాలా సంతోషం బాబూ. అమ్మాయినేమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ఇప్పుడే అడుగు. పెళ్ళైన తరువాత నీకు ఆ అవకాశం రాకపోవచ్చు" ఆనందం పట్టలేక అన్నాడు సుందరి తండ్రి రాజనాల.

అన్యాయం

"ఇది మరీ అన్యాయం. రేపట్నుంచి నేను స్కూలుకు వెళ్ళనుగాక వెళ్ళను" అన్నాడు ఆరేళ్ళ ప్రమోద్.
"అంత అన్యాయం ఏం జరిగిందిరా?" నవ్వుతూ అడిగాడు తండ్రి.
"లేకపోతే! మా టీచరేమో పుస్తకం చూస్తూ పాఠం చెబుతుంది. మమ్మల్ని మాత్రం చూడకుండా పాఠం అప్పజెప్పమంటుంది, తప్పుకాదూ" ముక్కుపుటలు విశాలం చేస్తూ అన్నాడు ప్రమోద్.

దిష్టి

"కాంపౌండరు గారూ..... నిన్నాటినుండి తలంతా దిమ్ముగా ఉంది. తలపోటుగా ఉంది. డాక్టరు గారు లేరా?" మూలుగుతూ అడిగింది కన్నాంబ.
"మీరు కూర్చోండి. డాక్టరు గారు లోపల ఉన్నారు" అన్నాడు కాంపౌండరు.
"త్వరగా పిలవండి ప్లీజ్"
"వస్తారుండమ్మా డాక్టరుగారికి రాత్రి నుంచి తలపోటుగా వుంటే వాళ్ళమ్మ చేత దిష్టి తీయించుకుంటున్నారు" చెప్పాడు కాంపౌండరు.

విలువ

"రెండు ప్లేట్లు వేడి వేడి గారెలు పట్రావోయ్" ఆర్డరేశాడు బ్రహ్మానందం.
"చిత్తం సార్" వెళ్ళి రెండు నిమిషాల్లో తెచ్చాడు సర్వర్.
"ఆహా... కమ్మగా ఉన్నాయ్... ఉప్పు చక్కగా సరిపోయింది. పిండి రోట్లో రుబ్బారా?" తింటూ అడిగాడు బ్రహ్మానందం.
"అవును సార్"
"ఎంతైనా గ్రైండర్లో రుబ్బితే ఇంత రుచి రాదు. చాలా బాగున్నాయి. మరో నాలుగు పట్రా"
"థ్యాంక్యూ సార్. మీరైనా ‘చెమట’ విలువ గ్రహించారు" వెళ్ళాడు సర్వర్.

26 June 2007

తెలుగు టీ.వి. కార్యక్రమాలు చూళ్లేక

భార్య : ఎందుకండీ.. అంతగా తాగుతున్నారు.
భర్త : గంటసేపట్లో తెలుగు టీ.వి. కార్యక్రమాలు వస్తాయి కదా.. వాటిని చూసి తట్టుకోటానికి తాగుతున్నాను.

పొదుపరి భర్తతో తిప్పలు

భార్య : చీర కొనుక్కుంటాను.. వెయ్యి రూపాయలిమ్మంటే ఇవ్వరేం. పెళ్లికి ముందు డబ్బుని నీళ్లలా ఖర్చుపెడతానని కోతలు కోశారు.. నిలదీసింది భర్తని.
భర్త : ఓసి పిచ్చిదానా.. నీకింకా తెలియదేమో.. నేను నీళ్లని కూడా చాలా పొదుపుగా వాడతాను.

అర్ధం కాని సినిమా

విజ్ఞాన్‌ : నా అభిమాన హీరో నటించిన సిన్మాలన్నీ కనీసం నాలుగైదు సార్లు చూస్తాను తెలుసా.
జానీ : ఏం పాపం ఒక్కసారి చూస్తే అర్ధం కాదా.

అందంగా కన్పించాలని

రమేష్‌ : పడుకునేముందు షోగ్గా తయారయి పడుకుంటున్నావు.
వివేక్‌ : కలలో కన్పించే అమ్మాయిలకు అందంగా కన్పించాలని ...

ఐరన్‌ టానిక్‌

భర్త : ఏమే కాంతం . నాకెందుకో భయంగా ఉందే.
భార్య : ఎందుకు ... ??
భర్త : మరి నెల రోజులనుండి ఐరన్‌ టానిక్‌ వాడుతున్నాను కదా.. పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని..

రెండో ఆపిల్ పండు

రాజేష్ : న్యూటన్‌ ఆపిల్‌ పండు కింద పడగానే కిందకు ఎందుకు పడిందని ఆలోచించాడు. మరి నువ్వైతే.
గిరీష్ : పడగానే తినేసి రెండోది ఎప్పుడు పడుతుందా ... అని ఆలోచిస్తాను.

డ్రింకుమీద ప్రమాణం

గోపీ : ఇక మీదట డ్రింక్‌ ముట్టుకోనని ప్రణామం చేశావు కదరా.
రాము : అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను!!!

అతని పేరు ఏడుకొండలు

"అతనేంటి పేరగడితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండలవేపు చూపించి వెళ్ళిపోతున్నాడు?"
"ఓ... అతనా... అతని పేరు ఏడుకొండలు"
"సోమవారం రోజున ఆయన మౌన వత్రం లేండీ! మాట్లాడడు!"

ఇవాళ ఆలస్యమయ్యిందేం?

"బడికి ఇవాళ ఆలస్యమయ్యిందేం రా?" అడిగింది టీచర్ స్టూడెంట్ని
"బడికి ఆలస్యంగా రానని... వందసార్లు ఇంపోజిషన్ రాయమన్నారుగా"
"అది రాయటం వల్లే ఆలస్యం అయ్యింది మేడమ్"! చెప్పాడు స్టూడెంట్...

కిలో నూనె ఎంతండీ?

"షాపులో కిలో నూనె ఎంతండీ?" అడిగింది సుజాత
"నలభై రూపాయలు" చెప్పాడు వ్యాపారి
"ఒకే సారి పదికిలోలు తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా?"
"ఒక పావు కిలో తగ్గుతుంది"! అని చెప్పాడు వ్యాపారి నవ్వుతూ...

సార్ టైమెంతయింది?

"సార్ టైమెంతయింది?" అడిగాడు సుధీర్
"తొమ్మిదీ పది" చెప్పాడు వాచి చూసి శంకర్
"కరెక్టుగా చెప్పండి?" సార్ "మరీ గంటతేడాతో చెబుతారేం"! విసుకున్నాడు సుధీర్.

స్కూలులో ఎవరంటే ఇష్టం?

"విద్యార్థులూ మీకు మీ స్కూలులో ఎవరంటే ఇష్టం?" అని అడిగారు డీఇఏ విద్యార్థుల్ని
"అటెండరంటే మాకు చాలా ఇష్టం"! అన్నారు విద్యార్థులు
"ఎందుకుని?" అడిగారు డీఇఏ
"మేము ఇళ్ళకు వెళ్ళాలంటే బెల్‌ కొట్టవలసింది... అతనే కదండీ"! అన్నారు విద్యార్థులు.

వెయ్యి చీరలైనా...

భార్య : నేను టీవీ సీరియల్స్‌లో నటిస్తానండీ.
భర్త : ఎందుకు
భార్య : మరి సీరియల్‌ పూర్తయ్యేలోగా వెయ్యి చీరలైనా కట్టుకోవచ్చండీ.

25 June 2007

ఎవరు దూరం..

రాము : రేయ్ రాజూ.. నేనో ప్రశ్న అడుగుతా.. జవాబు చెప్పు..
రాజు : అలాగే..రాము : మనకు అమెరికా దూరమా.. సూర్యుడు దూరమా..
రాజు : అమెరికానే దూరం..
రాము : ఎలా చెప్పగలవు..
రాజు : ఏముంది.. మనం రోజూ సూర్యుణ్ణి చూడగలం కానీ.. అమెరికాను చూడలేం కదా.

ఇంగ్లీషులో చెప్పు తెలుగు

పిల్లలను పరిచయం చేసుకుంటున్నాడు కొత్త మాస్టారు
మాస్టారు : ఒరేయ్.. నీ పేరు, మీ నాన్న పేరు చెప్పరా..
విద్యార్థి : నా పేరు చిట్టిబాబు, మా నాన్న పేరు సూర్యప్రకాశ్ అండీ..
మాస్టారు : ఏదీ.. దాన్నే ఇంగ్లీషులో చెప్పు చూద్దాం..
విద్యార్థి : నా పేరు లిటిల్ బాయ్, మా నాన్న పేరు సన్ లైట్ అండీ..
మాస్టారు : ఆ ??!

రోగం తిరగబెట్టింది

తన పేషంటుకు ఫోన్ చేసాడు డాక్టర్...
డాక్టర్ : ఏమయ్యా.. ఇదేమైనా పద్దతిగా ఉందా..
పేషంట్ : విషయమేంటో చెప్పండి డాక్టర్ గారూ..
డాక్టర్ : ఫీజుగా నువ్విచ్చిన చెక్ బౌన్స్ అయ్యి తిరిగి వచ్చింది.. తెలుసా..
పేషంట్ : మరి క్రితంసారి మీరు నయం చేసిన రోగం నాకు మళ్లీ తిరిగి వచ్చింది.. తెలుసా..
డాక్టర్ : ఆ ??!

మాజీ ప్రియుడు

ఇద్దరమ్మాయిలు బజారులో వెళుతున్నారు. ఇంతలో ఒక బిచ్చగాడు అక్కడికి వచ్చాడు.
బిచ్చగాడు: అమ్మా... కొంచెం దయ చూపించండి
ఒకమ్మాయి అతని జోలెలో వంద రూపాయల నోటు వేసింది.
రెండో అమ్మాయి: (ఆశ్చర్యంగా అడిగింది...) ఏమే ఎందుకంత వేశావ్ ?
మొదటి అమ్మాయి: పాపం అతను ఇంతకు ముందు ఇలాంటి నోట్లు నా కోసం చాలా ఖర్చు చేశాడులే....

కాకి గోల

అక్కడో రెండు కాకులు వాలాయి. వాటిని చూసిన ఇద్దరు మగువల మధ్య జరిగిన సంభాషణ ఇది.
సరిత: అది ఆడ కాకి, ఇది మగ కాకి తెలుసా ?
హరిత: నీకెలా తెలుసు ?
సరిత: అక్కడున్నదేమో చీర పైన వాలింది, ఇక్కడున్నది షర్ట్ పైన వాలింది

జంధ్యాల మచ్చుతునకలు

  • భర్త భార్యను ప్రేమించే పద్ధతికి, భార్య భర్తను వేదించే పద్ధతికి సరైన నిర్వచనం :- పెళ్ళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క - ఆ క్షణం నుంచి అదే ఆడది అల్లంచెక్క, నీ పీకనొక్క
  • మొక్కుబడికి బుక్కులన్నీ చదివినా కుక్కగొడుగు మొక్కలా, చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా, కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా, బిక్క మొహం వేసుకొని, వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ డెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ, ఇక్కడే ఈ ఉక్కలో గుక్కపెట్టి ఏడుస్తూ, ఈ చుక్కల చొక్కా వేసుకొని డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపీనుగులా చక్కిలాలు తింటూ, అరటి తొక్కలా, ముంగిట్లో తుక్కులా, చిక్కు జుట్టు వేసుకొని ముక్కు పొడి పీలుస్తూ, కోపం కక్కుతూ, పెళ్ళాన్ని రక్కుతూ, పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ, రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కినక్కి ఈ చెక్క బల్ల మీద బక్క చిక్కి ఇలా పడుకోకపోతే --- ఏ పక్కకో ఓ పక్కకు వెళ్ళి పిక్క బలం కొద్దీ తిరిగి, నీ డొక్క శుద్ధితో వాళ్ళని ఢక్కాముక్కీలు తినిపించి, నీలక్కు పరీక్షించుకుని ఒక్క చక్కని ఉద్యోగం చిక్కించుకొని, ఒక్క చక్కటి అడ్వాన్సు చెక్కు, చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి.
  • శ్రీకృష్ణ దేవరాయలు వంటి మహారాజు, కళా హృదయుడు తన మహామంత్రికి "అప్పాజీ" అని పేరు పెట్టుకున్నాడంటే.... అప్పు ఎంత విలువైనదో గ్రహించండి. ఇంగ్లీషులో కూడా "డౌన్" కంతే "అప్" ఉన్నతమైనది కాదా?
  • డబ్బు పెరిగినా, జబ్బు పెరిగినా ఆ తేడా ముఖంలోనే తెలుస్తుంది.
  • కుంతీ సెకండ్ సన్ బూన్… అదే భీమవరం…
  • గారెన్‌కర్రీ… అదేనమ్మ తోటకూర

మరి కొన్ని ఇక్కడ ఉన్నవి:

http://gsnaveen.wordpress.com/2006/10/12/jandhyala_meccutunakalu/

శంకర్ దాదా MBBS - సామెతలు

ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చింది
Enki’s marraige , Subbi death anniversary

వంద గొడ్లని తిన్న రాబందు ఒక్క తుఫానుకి చస్తుంది.
One vulture eat 100 buffaloes…. One cyclone dead.

ముందుంది ముసళ్ళ పండగ
In front, crocodiles festival

ఇల్లు అలకగానే, పండగ కాదు
House pasting...No festival

అమ్మాయిని ఎంపిక చేసుకునే విధానం

అబ్బాయిలూ! అమ్మయిని ఎంపిక చేసుకునేటప్పుడు ఈ సూత్రాలు గుర్తు పెట్టుకోండి.
  1. ఆమె ఇంటిపనులు శ్రద్ధగా నిర్వర్తించాలి, వంట బాగా చేయాలి.
  2. చలాకీగా కబుర్లు చెబుతూ మిమ్మల్ని ఎప్పుడూ నవ్విస్తుండాలి.
  3. మీరు కష్టాలో ఉన్నా మీవెంటే ఉందాలి.
  4. శృంగారంలో రంభను మరిపించాలి.
  5. అన్నిటికంటే ముఖ్య సూత్రం ఈ నలుగురు అమ్మాయిలూ ఒకరికొకరు తారసపడకుండా చూసుకోవాలి.

ఎంత భక్తి

"ఏమోయ్ మీరంతా ఈ మధ్య గుడి దగ్గర ఎక్కువ కనిపిస్తున్నారు, ఇంత భక్తి ఎప్పుడు పుట్టుకొచ్చింది?" ప్రశ్నించాడు లెక్చరర్.

"అవును సార్. ‘శ్రద్ధ’గా గుడికెళ్తే ‘శాంతి’ దొరుకుతుంది. మంచి ‘భావన’తో ‘పూజ’, ’ఆరతి’, ‘అర్చన’, ‘ఆరాధన’ చేయించి దేవుడి ముందు ‘జ్యోతి’ వెలిగిస్తే ’తృప్తి’, ’ముక్తి’ లభిస్తాయి. ఒకే చోట ఇన్ని దొరుకుతుంటే ఎందుకు వెళ్ళం సార్?" జవాబిచ్చాడో కొంటె కుర్రాడు.

24 June 2007

తల నొప్పి

"నిన్న రాత్రి భయంకరమైన తల నొప్పితో బాధ పడ్డాను" చెప్పాడు నవీన్
"అవునవును. ఆ తలనొప్పి సినిమా హాల్లో నీ పక్క సీటులో కూర్చుని ఉంది కదా. నేను కూడా చూశాను." అన్నాడు రాము.

సిగ్గు

కాలేజీకి వెళ్తున్న కూతురుతో కన్నారావు "అబ్బెబ్బె ఈ కాలంలో అమ్మాయిలకు బొత్తిగా సిగ్గు ఎగ్గు లేకుండా పోతున్నది. ఏంటా డ్రెస్సులు? మగవారంటే ఏ మాత్రం భయం లేదు. మా తరంలో నీ వయస్సు ఆడపిల్లలు నన్ను చూస్తే ఎంత సిగ్గు పడేవారో?" అరిచాడు.

"వాళ్ళు సిగ్గుపడేంత పనులు మీరేం చేసేవారు డాడీ?" అడిగింది కూతురు.

ఏనుగు - చీమ

ప్రశ్న : ఏనుగు రావటం చూసి, చీమ చెట్టు వెనక దాకున్నది? ఎందుకు??
జవాబు : కాలు అడ్డం పెట్టి ఏనుగుని పడేద్దామని


ప్రశ్న : ఒక ఏనుగు చీమ స్కూటర్ మీద వెళ్తుంటే ప్రమాదం జరిగి ఏనుగు చచ్చిపోతుంది. కానీ చీమ బతికే ఉంటుంది? ఎందుకలాగ?

జవాబు: చీమ helmet పెట్టుకున్నది!!

ఏనుగు - చీమ

ప్ర : ఏనుగు రావటం చూసి, చీమ చెట్టు వెనక దాకున్నది? ఎందుకు??
జ : కాలు అడ్డం పెట్టి ఏనుగుని పడేద్దామని

జేబులు

"ఏంటయ్యా నా ప్యాంట్‍కు, షర్టుకు జేబులు అస్సలు కుట్టలేదు? మరి నేను డబ్బులు ఎక్కడ దాచుకోవాలి ?" కోపంగా అన్నాడు పోలీసు వేంకటస్వామి టైలర్‍తో.

"పోండి సార్ భలేవారు మీరు. పోలీసులెక్కడైనా తమ జేబుల్లోంచి డబ్బు తీసి ఖర్చు చేస్తారా ఏంటి? అందుకు పెట్ట లేదు" అన్నాడు టైలర్.

Windows 2000 - తెలంగాణా భాషలో....

ఓక వేళ Windows 2000, తెలంగాణా భాషలో ఉంటే ఎట్లా ఉంటుంది??
Microsoft Windows 2000 = గింత అంత మెత్త కిటికీల్ రెండువేల్
Search = దెవులాడు
Save = బచాయించు
Save as = గిట్లా బచాయించు
Save All = గన్ని బచాయించు
Help = నన్ను బచాయించు
Find = ఎతుకు
Find Again = మళ్ళా ఎతుకు
Move = సర్కాయించు
Zoom = పెద్దగ చేయ్
Open = తెరువు
Close = ముయ్
New = కొత్తది
Old = పాతది
Replace = మార్చెయ్
Insert = నడిమిట్ల ఎట్టు
Space = జాగ
Backspace = ఎనక జాగ
Run = వురుకు
Print = అచ్చు
Copy = గట్లనే దించు
Cut = కోయ్
Paste = అతికియ్
Paste Special = పెషల్ అతికియ్
Delete = బొందలొ కొట్టు
View = సూడు
Tools = ముట్లు
Toolbar = ముట్ల గొట్టం
Exit = ఇగ వోరి
Mouse = ఎల్క
Click = ఒత్తు
Double Click = మల్ల మల్ల ఒత్తు
Scrollbar = తిప్పుడు గొట్టం
Errors = నీ నోట్ల మన్ను వడా!!
Home = ఇంటికి వో
End = కొనాక్కి వో

తగిన చోటు

"మోకాళ్ళ నెప్పులకు ఒక దివ్యౌషధం కని పెట్టారు. షాపు ఎక్కడ పెడితే సరుకు బాగా అమ్ముడౌతుంది?" సలహా అడిగాడు శంకర్.
"R.T.C Bus Stop ల దగ్గర పెట్టు. వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది" చెప్పాడు నారాయణ.

తారుమారు

ప్రసాద్ తన స్టెనోగ్రాఫర్‍ను ప్రేమించి, పెళ్ళి చేసుకున్నాడు.
"ఎలా ఉంది కాపురం?" పలకరించాడో మిత్రుడు.
"ఇప్పుడు ఆమె డిక్టేట్ చేస్తోంది!!!" చెప్పాడు ప్రసాద్.

మగవాళ్ళకు మాత్రమే

స్త్రీలను అర్ధం చేసుకోవడం మహాకష్టం...
  • వాళ్ళ అందాన్ని పొగిడితే అబద్ధం ఆడుతున్నామంటారు, పొగడకపోతే సౌందర్య దృష్ఠి లేదంటారు.
  • చెప్పిందానికల్లా ఒప్పుకుంటే డూడూ బసవన్నని వెక్కిరిస్తారు. ఒప్పుకోకపోతే అర్థం చేసుకునే మనసు లేదంటారు.
  • ఎక్కువ మాట్లాడితే "బోర్" అంటారు, మాట్లాడకపోతే ప్రేమ లేదంటారు.

.......

నాకు తెలీదా?

"ఏంటిది?" ప్రశ్నించాడు బాస్.
"డాక్టర్ సర్టిఫికెట్", చెప్పాడు ఉద్యోగి.
"ఎందుకు?"
"నేను వారంరోజులు పనిచేయలేనని"
"నువ్వు పనిచేయలేవని చెప్పడానికి డాక్టర్ సర్టిఫికెట్ ఎందుకు? నేను చెప్పలేనా?"