19 September 2007

మగవాళ్ళకు మాత్రమే

ఓ కంపెనీలో అందరూ మగాళ్ళను, అందునా పెళ్ళైన వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటున్నారు. పైగా ఆడవాళ్ళు అర్హులు కాదంటూ నోటిఫికేషన్‍లో రాయడంతో మండిపడ్డ మహిళా సంఘాలు ధర్నా చేశాయి. అసలు విషయం కనుక్కుంటే ఆ కంపెనీ యజమాని ఒక మహిళ. ఈ విషయం తెలిసిన మహిళా సంఘం నేతలు మరింత కోపం కలిగింది. ఆ యజమానిని ఈ విధంగా కోపంగా ప్రశ్నించారు "ఒక మహిళ అయ్యుండీ ఏమిటా నోటిఫికేషన్?"


"అబ్బే... మాకే విపక్షా లేదండి. ఇది ఇప్పుడిప్పుడే పైకొస్తున్న కంపెనీ. చెబితే వినేవాళ్ళు, ఆదేశాల్ని తక్షణం పాటించేవాళ్ళు, కోప్పడ్డా ఎదురుతిరగనివాళ్ళు కావాలి మాకు. అన్నిటికంటే ముఖ్యంగా ఆఫీస్ అవర్స్ అయిపోగానే తక్షణం ఇంటికి వెళ్ళాలనిపించకూడదు." అసలు విషయం చెప్పింది అధినేత.

8 comments:

  1. జోక్ అర్థం కాలేదు. దయచేసి వివరించరా? పుణ్యం ఉంటుంది

    ReplyDelete
  2. బావుందండీ.

    ReplyDelete
  3. పాపం anonymous గారికి పెళ్ళి కాలేదనుకుంటాను

    ReplyDelete
  4. హ హ హ కిసుక్కు ;-)

    ReplyDelete
  5. Anonymous అంటే అనామిక - ఆడవాళ్ళకు ఏలాగు ఈ జోకు నచ్చదు! వింతేముంది - అర్ధం కాలేదు అనడంలొ

    ReplyDelete
  6. very good jokes)))

    ReplyDelete