రామారావు ప్రతి రోజూ బార్కెళ్ళి మందు తాగుతాడు. విషయం ఏమిటంటే ప్రతీ రోజూ రెండు గ్లాసులు ఆర్డర్ చేసి పక్క పక్కనే పెట్టుకుని, ఒక్ సిప్పు ఒక గ్లాసులోంచి ,మరీ సిప్పు రెండో గ్లాసులోంచి తాగుతాడు. ఈ తతంగం అంతా చాలా రోజుల నుంచి చూసిన సర్వర్ ఆనందం ఉండబట్టలేక ఒక రోజు రామారావుని అడిగేశాడు.
"నేను ఎప్పుడూ మందు నా స్నేహితుడు సుబ్బారావుతో సలిసి తాగేవాడిని. ప్రమాదవశాత్తు అతను చనిపోయాడు. అతని జ్ఞాపకార్ధం ఈ విధంగా ఎప్పుడూ రెండు గ్లాసులు తాగుతున్నాను" చెప్పాడు రామారావు.
కొంతకాలం తరువాత రోజూ ఒక గ్లాసు మాత్రమే ఆర్డరు చెయ్యటం మొదలుపెట్టాడు రామారావు. ఈ విషయం గమనించిన సర్వర్ రామారావుని అడిగాడు "ఏంటి సార్ మీ స్నేహితుడిని పూర్తిగా మర్చిపోయారా?"
"లేదయ్యా నేను మందు మానేశాను" చెప్పాడు రామారావు.
హ్హ..హ్హ..
ReplyDeleteఇది చదువుతూ ఉంటే నస్కు ఓ జోకు గుర్తొచ్చింది..
"నేను మందు మానేద్దామనుకుంటున్న రా"
"ఓస్...అంతే కద..నేనిప్పటికి ఎన్నో సార్లు మానేసాను తెలుసా...చ్చీర్స్"
:)
మీరు చెప్పిన జోక్ ఇక్కడ ఉన్నది:
ReplyDeletehttp://telugu-jokes.blogspot.com/2007/07/blog-post_15.html