13 July 2007

నువ్వు నాకు నచ్చావు - పేరడీ కవిత, ప్రార్ధన

కవిత
నాన్న...

గుర్తు చేసుకోవడానికి వంశం ఇచ్చావ్....
కొట్టుకోవడానికి పెద్ద పెద్ద తొడలు ఇచ్చావ్....
జనాలని హింసించదానికి దిక్కుమాలిన సినిమాలనిచ్చావ్....
మమ్మల్ని భరించడానికి నిర్మాతలనిచ్చావ్....
ఏమైనా చేసుకోవడానికి విజయశాంతినిచ్చావ్....
మాలో మేము తన్నుకోవడానికి చానా తోబుట్టులనిచ్చావ్....

నాన్న....(ఏడుపు కళ్ళతో)
పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న అక్కా బావల నిచ్చావ్....
అడక్కుండానే పిన్నిని ఇచ్చావ్....
ఎలాంటి నినిమాలు తీసినా భరించే అభిమానులనిచ్చావ్....

చివరకొస్తే....
నిర్మాతలని కాల్చేయడానికి గన్నిచ్చావ్....
కానీ ఎందుకు నాన్నా ఇంత తొందరగా చచ్చావ్....
అయినా నువ్వు నాకు నచ్చావ్....

****************
ప్రార్ధన


దేవుడా.....
ఓ మంచి దేవుడా.....
నువ్వు నాకు ఫ్లాప్ అవ్వడానికి

  • జాన్నీ ఇచ్చావ్.....

  • గుడుంబా శంకర్ ఇచ్చావ్....

  • బాలు ఇచ్చావ్.....

  • బంగారం కూడా ఇచ్చావ్....


ఇలాగే మన స్టేట్‍లో ఉన్న ఏడుగురు హీరోలకి ఇస్తావని.....
అలాగే మన countryలో ఉన్న 150 మంది హీరోలకి....
అదే చేత్తో ప్రపంచంలో ఉన్న ????? - నాకు number correctగా తెలియదు.....
ఎంత మంది ఉంటే అంతమందికీ ఇవే flops ఇస్తావని
అంటే as it is గా ఇవే flops కాదు...
వాళ్ళు ఏ సినిమా తీస్తే ఆ సినిమా

  • స్టాలిన్

  • అశోక్

  • మున్నా

  • సైనికుడు

  • విక్రమార్కుడు

  • ....


అలాగే ఇస్తావని కోరుకుంటున్నాను.....
నువ్వు ఇస్తావ్ నాకు తెలుసు....
ఎందుకంటే... basically you are GOD....
you are very good GOD....
అంతే....That's all....
నా ప్రార్ధన మీ అందరికీ కొంచెం కొత్తగా అనిపించొచ్చు....
************

5 comments:

  1. అదరగొట్టావు మిత్రమా... టోపీలు తొలగె..(హ్యాట్స్ ఆఫ్)

    ReplyDelete
  2. కొత్తగా కాదు చెత్తగా {చాలానవ్వగా }భావుంది.

    ReplyDelete
  3. గౌరి కుమార్ గారూ!
    పేరడి అద్భుతంగా ఉంది..ఇలాంటివి తరుచూ అందించే బాధ్యతతో పాటు నా అభినందనలు కూడా అందుకోండి.
    రేణుకా మూర్తి.

    ReplyDelete